“క్రాక్” హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా

I wish Krack Movie Will Be My Hat trick Movie With Gopichand Malineni Says Ravi Teja,Krack: Ravi Teja’s Energetic Speech At Pre Release Event Is Received With Whistles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja About Krack Movie,Ravi Teja Comments On Krack Telugu Movie,Mass Maharaja Ravi Teja Comments On Krack Telugu Movie,Ravi Teja About Krack Movie Story

మొత్తానికి చిన్న చిన్నగా టాలీవడ్ లో పూర్వపు కళ వస్తుంది. షూటింగ్స్, ప్రమోషన్స్, ఆడియో లాంచ్ లు ఇలా ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది. కరోనా వల్ల గత కొన్నినెలలుగా ఆ సందడిని కోల్పోయాం. ఇక ఇప్పుడు ఆ సందడి మొదలవుతుంది. ఇక ఈ సంక్రాంతికి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో రవితేజ నటించిన క్రాక్ కూడా ఒకటి. ర‌వితేజ న‌టించిన క్రాక్ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుండ‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిన్న నిర్వ‌హించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. దాదాపు ఏడాది అవుతుంది ఈ సందడిని మిస్ అయి.. ఇక వంశీ, అనిల్ రావిపూడికి స్పెషల్ థ్యాంక్స్ ఈ ఈవెంట్ కు వచ్చినందుకు.. మొదట ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్స్ కాసర్ల శ్యామ్ ఒక సాంగ్ రాసాడు, రామజోగయ్య శాస్త్రి మూడు పాటలు రాశారు. పాటలకు బ్రహ్మాండమైన ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఇక నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ‘శంభో శివ శంభో’ ఒకటి. సముద్రఖని గారు మంచి రైటర్.. దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన విలన్ క్యారెక్టర్ చేశారు. బుర్రా సాయి మాధవ్ మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. హిట్, ప్లాప్ లకు సంభందం లేకుండా థమన్ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తాడు. అలాగే ఈ చిత్రానికి ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ చేసాడు. తెరవెనుక హీరోలు జి.కె. విష్ణు కెమెరా విజువల్స్ బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. లైటింగ్, ఫ్రేమ్స్ పెట్టె విధానం చాలా బాగుంది. ఆయనతో వర్క్ చేయడం వెరీ హ్యాపీ. ముందు ముందు ఇంకా ఆయనతో వర్క్ చెయ్యలనుకుంటున్నాను. రామ్ లక్ష్మణ్ లు నా సినిమాలకి ఎప్పుడూ ఫైట్స్ బాగా కంపోజ్ చేస్తారు. సినిమా సినిమా కి వాళ్ళు బాగా ఎదుగుతూ అప్డేటెడ్ గా వుంటారు. వందశాతం పాజిటివ్ నెస్ తో వుంటారు. శృతిహాసన్ తో ఇది రెండవ సినిమా. తను చాలా చాలా బాగా చేసింది. ఆలీతో చేసిన అన్నీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. మళ్ళీ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించారు. గోపీచంద్ మలినేని చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. సక్సెస్ మీట్ లో కలుద్దాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న “క్రాక్” హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి.. అన్నారు.

కాగా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి చూడబోతే ఈ సినిమాతో రవితేజ గోపీచంద్ హ్యాట్రిక్ కొట్టేలాగే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 13 =