కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 80

సినిమా వార్తలు

'చిరు' సినిమాలో 'సోనూసూద్'..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది సోనూసూద్ పేరే. రీల్ లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు అందరికీ. కరోనా వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఎంతో మంది పేదలకు సాయం చేసాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు.. దాదాపు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా చెప్పాడు. ఇక ఇటీవల రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ ఇవ్వ‌డం, జాబ్ కోల్పోయిన మ‌హిళ‌కి ఉద్యోగం క‌ల్పించ‌డంతో అందరూ సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "రాజకుమారుడు "మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కోబ్రా' - ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్..?

జయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాగార్జున కు జోడీగా ఇలియానా ?

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "PSV గరుడ వేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా ను ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ పాత్రలో శృతి హాసన్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నిజ జీవిత సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. గోపీచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో రూపొందిన "డాన్ శీను ", "బలుపు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "క్రాక్ " తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'

మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట కొన్ని పరాజయాలే అందుకున్నాడు. ఇక ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... తొలిప్రేమ,ఎఫ్2 తో కామెడీ యాంగిల్ ను చూపించాడు..గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాజమౌళి'ని కూడా వదలని కరోనా... ఫ్యామిలీకి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అలాంటి నెగిటివ్ షేడ్ పాత్రలో నటించాలని ఉంది..!

ఈమధ్య హీరోయిన్స్ కూడా తమ రూట్ మార్చారు. ఒకప్పుడు గత కొన్నేళ్లుగా హీరోయిన్ అంటే నాలుగు సీన్స్, గ్లామర్, నాలుగు పాటలు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కేవలం కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా వాళ్ళు కూడా కొత్త కొత్త పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోయిన్స్ పుణ్యమా అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగా రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రచయితలు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బ్లాక్ అండ్ వైట్' ఛాలెంజ్ తో ఉమెన్ సపోర్టింగ్

కరోనా వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్‌ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో వర్కౌట్స్ , వంటలు, ఆన్ లైన్ క్లాసులు వింటూ టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తమ అభిమానులకు కూడా చేరువగా ఉంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫిల్మ్ స్టూడియో ప్లాన్ లో సుధీర్ బాబు

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుధీర్ బాబు "ప్రేమ కథా చిత్రమ్ ", "సమ్మోహనం "సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ" మూవీ తో సుధీర్ బాబు బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సుధీర్ బాబు, ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.

Team TFNవాట్సాప్
Sridevi Daughter Janhvi Kapoor To Play The Lead Role In Ala Vaikunthapurramuloo Hindi Remake
సినిమా వార్తలు

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .." మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు "అల .. వైకుంఠపురములో .." మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు తేజ మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్ ?

అభిషేక్ ఆగ్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడి గా "అలిమేలు మంగ వెంకట రమణ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఒక కథానాయిక గా కీర్తి సురేష్ ఎంపిక అయ్యారు. మరో కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేయాలని దర్శకుడు తేజ ప్లాన్ చేశారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' క్వారెంటైన్ పోస్టర్ రిలీజ్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్‌ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. క్వారెంటైన్ పోస్టర్ పేరుతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూడటానికి కాస్త రొమాంటిక్ గానే అనిపిస్తుంది. అఖిల్ లాప్ టాప్ చూస్తూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేస్తుంది. ఈ పోస్టర్ యూత్ ను…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిహారిక పెళ్లి పనులు షురు.. ఎంగేజ్‌మెంట్ డేట్‌ ఆ రోజే..!

మెగా కాంపౌండ్ లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే తనకు కాబోయే వరుడు గురించి పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా చైతన్య పనిచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇండిపెండెన్స్ రోజు ఆ జెండాలను వాడుదాం..!

కేవలం సినిమాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే విషయాల్లో కూడా మన టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఎప్పుడూ ముందుకొస్తునే ఉంటారు. ఇప్పటికే కరోనాపై తమకు తోచిన సలహాలు, సూచనలు ఇచ్చారు ప్రజలకు. ఇక ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్లాంటబుల్ ఫ్లాగ్ సీడ్‌ను రూపొందించారని, వాటినే జెండాలుగా వాడాలని అందరికీ సూచిస్తున్నారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. ఇప్పటికే ఎంతో మంది దీనిపై స్పందించగా... తాజాగా సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. 'ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనమంతా మన దేశ భక్తిని చాటి చెప్పేందకు బయో డీగ్రేడబుల్ జెండాను వాడుదాం. వాటిని తిరిగి మనం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క ఆరోగ్య సూత్రాలు

కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "అరుంధతి ", "బాహుబలి ", " రుద్రమదేవి ", "బాహుబలి 2", "భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "నిశ్శబ్దం " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో సాయి పల్లవి

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పై దృష్టి సారించారు. ప్రముఖ నిర్మాతలు , దర్శకులు కూడా వెబ్ సిరీస్ రూపొందించడానికై ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత , శృతి హాసన్ వెబ్ సిరీస్ లలో నటించగా కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వెబ్ సిరీస్ లను ఓకే చేశారు. తన మనసు నచ్చే మూవీస్ను ఎంపిక చేసుకొనే ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' - భయపెడుతున్న 'అధీర' లుక్..!

'కె.జి.యఫ్ 2' నుండి త్వరలో అప్ డేట్ అని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఆ అప్ డేట్ ఏంటబ్బా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఆ అప్ డేట్ ఏంటో తెలిసిపోయింది. ఈ రోజు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లోని అధీరా లుక్‌ను విడుద‌ల చేసింది. ఈ లుక్‌ను విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.. ‘‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు.. మన షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా సర్ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే చెప్పేదేముంది అధీర అనే పేరుకు తగ్గట్టే ఉంది. తెల్ల‌టి గ‌డ్డం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిహికాను పెళ్లిచేసుకోవడం నా లైఫ్ లోనే బెస్ట్ టైమ్..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే ట్యాగ్ నుండి ఇప్పటికే నితిన్ బయటపడిపోయాడు. ఇక ఈ లిస్ట్ లో నుండి రానా కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చేయనున్నాడు. ఇప్పటికే రానా - మిహికాతో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోగా ఆగష్ట్ లో మిహికా మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఇక ఈ సందర్భంగా తన పెళ్లి గురించి, మిహికా గురించి మాట్లాడుతూ రానా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే…

TFN Adminవాట్సాప్

షేర్