‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ క్వారెంటైన్ పోస్టర్ రిలీజ్

Akhil Akkineni and Pooja Hegde New Movie Most Eligible Bachelor Quarantine Poster Is Out

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్‌ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. క్వారెంటైన్ పోస్టర్ పేరుతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూడటానికి కాస్త రొమాంటిక్ గానే అనిపిస్తుంది. అఖిల్ లాప్ టాప్ చూస్తూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేస్తుంది. ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. తెలిసిందేగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్ప‌టికే 70 షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఒక షెడ్యూల్ షూటిగ్ మాత్ర‌మే బ్యాల‌న్స్ వుంది. ఈ కొరోనా క్రైసిస్ కొంచెం త‌గ్గితే ఈ షెడ్యూల్ ని కూడా తొందర్లోనే కంప్లీట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ లాక్ డౌన్ గ్యాప్ లో మ్యూజిక్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసినట్టు తెలుస్తుంది. అన్నీ సెట్ అయితే 2021 జ‌న‌వ‌రి లో విడుద‌ల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం అప్పటికి పరిస్థిట్లు ఏమన్నా మారుతాయేమో.

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =