‘కె.జి.యఫ్ 2’ నుండి త్వరలో అప్ డేట్ అని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఆ అప్ డేట్ ఏంటబ్బా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఆ అప్ డేట్ ఏంటో తెలిసిపోయింది. ఈ రోజు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లోని అధీరా లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. మా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు ధన్యవాదాలు.. మన షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా సర్ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే చెప్పేదేముంది అధీర అనే పేరుకు తగ్గట్టే ఉంది. తెల్లటి గడ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెసింగ్, ముఖంపై టాటూ, పెద్ద కత్తి పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్న లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ADHEERA’ – Inspired by the brutal ways of the vikings⚔🔥
Happy Birthday @duttsanjay baba, thank you for being a part of #KGFCHAPTER2. Looking forward to our craziest schedule soon. #AdheeraFirstLook@VKiragandur @TheNameIsYash @SrinidhiShetty7 @bhuvangowda84 @BasrurRavi pic.twitter.com/99eZIivhii— Prashanth Neel (@prashanth_neel) July 29, 2020
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా… శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరుగందూర్ భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: