ఈమధ్య హీరోయిన్స్ కూడా తమ రూట్ మార్చారు. ఒకప్పుడు గత కొన్నేళ్లుగా హీరోయిన్ అంటే నాలుగు సీన్స్, గ్లామర్, నాలుగు పాటలు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కేవలం కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా వాళ్ళు కూడా కొత్త కొత్త పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోయిన్స్ పుణ్యమా అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగా రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రచయితలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియమణి ఎన్నాళ్ళ నుంచో లేడీ విలన్ పాత్రలో నటించాలని ఆశపడ్డానని చెబుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇంటివద్దే ఉంటున్న ప్రియమణి సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రస్తుతం ‘విరాట్ పర్వం’ అనే చిత్రంలో నటిస్తున్నాని.. అందులో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నానని తెలిపింది. లాక్‌డౌన్ రోజుల్లో కొత్త కథలు వింటున్నా.. గతంలో పరిస్థితులు వేరేగా ఉండేవి.. హీరోలకు అధికంగా గౌరవించి హీరోయిన్లకు తక్కువగా చూసేవారని… ఇప్పుడు మారిపోయింది ఇద్దరినీ సమానంగా గౌరవిస్తున్నారని వివరించారు. అంతేకాదు… ‘పడయప్పా’ చిత్రంలో రమ్యకృష్ణ నటించిన ‘నీలాంబరి’ వంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఎన్నాళ్ళనుంచో కోరికగా ఉందని, అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదని, ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో నటించాలని కూడా ఆశపడుతున్నానని తెలిపింది. మరి అప్పుడంటే కష్టం కానీ ఇప్పుడు ఇలాంటి పాత్రలు రావడం కొంచం ఈజీ అని చెప్పొచ్చు. చూద్దాం మరి అలాంటి పాత్ర ప్రియమణి కోసం ఎవరైనా రాస్తారేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: