ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 81

ఇంటిపేరు కాదు టాలెంట్ ఉంటేనే సక్సెస్..!

#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ

ఆనందంలో నాగశౌర్య

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
ప్రజలకు మహేష్ బాబు సందేశం

షూటింగ్ కు రెడీ - రష్మిక
మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?
వర్మ 'మర్డర్' ట్రైలర్ రిలీజ్


"పొన్నియిన్ సెల్వన్ " మూవీ లో కీలక పాత్ర

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ డ్రీమ్
బాలీవుడ్ ఆఫర్స్ అంత ఈజీ కాదు - రకుల్ ప్రీత్
సోషల్ మీడియా లో మహేష్ బాబు సెన్సేషన్

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్
తుది శ్వాస విడిచిన వెటరన్ యాక్టర్,రచయిత 'రావి కొండలరావు'
ఈ ఏడాది కరోనా వచ్చి ఒక పక్క సినీ పరిశ్రమకు అసలే తీవ్ర నష్టంలో ఉంటే.. మరోపక్క పలు సినిమా పరిశ్రమలకు చెందిన లెజెండ్రీ నటులతో పాటు కొంతమంది యువ నటీనటులు కూడా మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరో వెటరన్ నటుడు రావి కొండలరావు తుది శ్వాస విడిచారు. గుండెపోటు కు గురైన రావి కొండలరావు హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో చేరిపించగా.. అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

ఇంటిపేరు కాదు టాలెంట్ ఉంటేనే సక్సెస్..!
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం పై పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు నెపోటిజంను మొదటి నుండి వ్యతిరేకించే బాలీవుడ్ క్వీన్ కంగనా పలువురిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో నేషనల్ వైడ్ గా ఈ టాపిక్ మరింత వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడగా ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.

#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన స్నేహ వివాహానంతరం సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళ మూవీస్ లో స్నేహ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన "వినయ విధేయ రామ " మూవీ లో నటించిన స్నేహ తిరిగి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.
దుల్కర్ - హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్.. 'లెఫ్టినెంట్ రామ్' ప్రేమకథ..
మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాతోనే మంచి గుర్థింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో…

ఆనందంలో నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్న ఈ మూవీ లో "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న "NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.
ప్రజలకు మహేష్ బాబు సందేశం
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి, ప్రతీ మంచి సందర్భానికి ట్వీట్స్ ద్వారా ప్రజలకు సందేశం ఇస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు ఇంటికి పరిమితం అయ్యి తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట " మూవీ కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక సెట్స్ పైకి వెళ్ళనుంది .
క్రియేటివ్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే.. కృష్ణవంశీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా?
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృషవంశీ అని టక్కున చెప్పేస్తాం. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియంటెడ్ ….ఇలా అన్ని రన్నింగ్ జోనర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ తీసిన అరుదైన ఘనత కృష్ణవంశీ కి దక్కుతుంది.

షూటింగ్ కు రెడీ - రష్మిక
పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ కన్నడ బ్యూటీ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో రష్మిక దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.
ధ్రువ సర్జా, రష్మికా 'పొగరు' సినిమా నుండి రానున్న 'కరాబు' పాట
కన్నడ స్టార్ హీరో.. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'పొగరు'. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'విక్టరీ', 'అధ్యక్షా', 'రన్న', 'ముకుంద మురారి' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి 21 F "ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా "18 పేజెస్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. "18 పేజెస్ " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

"చంద్రముఖి " మూవీ సీక్వెల్ హీరోయిన్ కియారా అద్వానీ ?
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు , జ్యోతిక , నయనతార ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ హారర్ "చంద్రముఖి "తమిళ మూవీ 2005 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "చంద్రముఖి " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. "చంద్రముఖి " మూవీ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , జర్మన్ , టర్కిష్ భాషలలో రిలీజ్ అయింది.
వర్మ 'మర్డర్' ట్రైలర్ రిలీజ్
సాహితి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ను తీస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటినుండి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేసాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తండ్రి తన కూతురిని గారాబంగా చూడడం, అమృత ప్రేమలో పడడం, ప్రణయ్ హత్య ఇలా తదితర అంశాలు ట్రైలర్‌లో చూపించారు. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం…

'మెలొడీ బ్రహ్మ' గురించి మీకు తెలుసా..?- 2 దశాబ్దాలు.. ఒక్క ఆడియో ఫంక్షన్ మాత్రమే..!
మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు మణిశర్మ. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. ఒక పదేళ్లు వెనక్కి వెళితే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే దాదాపు అన్ని సినిమాలూ ఉండేవి. కెరీర్ మొదట అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం…

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ లో కీలక పాత్ర
తెనాలి లో జన్మించి , వైజాగ్ లో పెరిగిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ ముంబై లో స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. భరత నాట్యం నేర్చుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా లో కాంటెస్ట్ లో పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ "రామన్ రాఘవ్ 2.0" మూవీ తో శోభిత బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హిందీ , మలయాళ మూవీస్ లో నటిస్తున్న శోభిత సూపర్ హిట్ "గూఢచారి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ డ్రీమ్
సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ టాలీవుడ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కిక్ " మూవీ లో సంగీతానికి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. థమన్ సంగీతం అందించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ సంగీత దర్శకుడు. సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ అందిస్తున్నారు.
బాలీవుడ్ ఆఫర్స్ అంత ఈజీ కాదు - రకుల్ ప్రీత్
దక్షిణాది భాషల సినిమాలలో స్టార్ డమ్ పొందిన హీరోయిన్స్ తమ గోల్ గా బాలీవుడ్ ను ఎంచుకొంటారని తెలిసిన విషయమే. బాలీవుడ్ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ వస్తుంది. అందుకే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ మూవీస్ పై ఆసక్తి చూపుతారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ అంత ఈజీ కాదని రకుల్ చెప్పారు. రకుల్ మాట్లాడుతూ .. దక్షిణాది భాషలలో స్టార్ డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పట్టించుకోదని , బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్ మొదటి మెట్టునుండీ ప్రారంభించాల్సిందే నని , మూవీస్ సక్సెస్ ను బట్టి స్టార్ డమ్ వస్తుందని చెప్పారు.
సోషల్ మీడియా లో మహేష్ బాబు సెన్సేషన్
"భరత్ అనే నేను ", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. నాగశౌర్య ఈ మూవీ లో ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
సమంత ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లాక్ డౌన్ సమయంలో రీల్ లైఫ్ విషయాలతో పాటు రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , పెట్ డాగ్ తో ఆడుకుంటూ , టెర్రస్ పై ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.