కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “అరుంధతి “, “బాహుబలి “, ” రుద్రమదేవి “, “బాహుబలి 2”, “భాగమతి ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్దం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “నిశ్శబ్దం ” మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ స్వంతం చేసుకున్న అనుష్క నటి కాకముందు యోగా టీచర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చే అనుష్క తన ఆరోగ్య రహస్యాలను వెల్లడించారు. ప్రతి రోజూ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటానని , యోగా కు రోజూ 2గంటల సమయం కేటాయిస్తానని , నేచురల్ గా వుండే ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తానని , మంచినీరు ఎక్కువగా తాగుతానని , జ్యుస్ లు తాగుతానని , రోజుకు 8 గంటలు నిద్ర కు ప్రాధాన్యతనిస్తానని , షూటింగ్స్ టైమ్ ను బట్టి నిద్ర టైమింగ్స్ మార్చుకొంటానని అనుష్క తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































