‘రాజమౌళి’ని కూడా వదలని కరోనా… ఫ్యామిలీకి కరోనా పాజిటివ్..!

SS Rajamouli & Family Tests Positive for COVID 19

కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేను, నా కుటుంబసభ్యులు గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. ఈ రోజు ఫలితాలు వచ్చాయి.. కరోనా పాజిటివ్‌గా వచ్చింది… వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం… ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి తెలిపారు.

 

ఇప్పుడు రాజమౌళికి కూడా కరోనా పాజిటివ్ రావడం తో అటు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అందరికీ షాకింగ్ గా ఉంది. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పాజిటివ్ వస్తుందంటే… ఇంకా జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో రాజమౌళి కి వచ్చిన సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here