
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 79

పవన్ కళ్యాణ్ మూవీ లో రకుల్ ప్రీత్ ?
త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని
"ఫ్రెండ్ షిప్ "మూవీ గ్లింప్స్ వీడియో రిలీజ్
ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి..!
కియారా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్

11 వసంతాల "మగధీర "
అప్పట్లో ఇలా.. యాక్టర్ అయిపోదామనుకున్నా..!
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ
'ఘర్షణ' సీక్వెల్ కావాలా?
హ్యాపీ బర్త్ డే - నా ఓటు నీకే బ్రదర్
దర్శకుడు ప్రశాంత్ వర్మ మూవీ అప్ డేట్
కరోనా పై రకుల్ ప్రీత్ స్పందన
'వీడియో గేమ్' కొనడంలో 'మహేష్-సితార' బిజీ..!
డిటెక్టివ్ పాత్ర లో స్టార్ హీరోయిన్ త్రిష
సమంత ఇంటి వ్యవసాయం

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2', పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్‌లో '18 పేజెస్' చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.
పవన్ కళ్యాణ్ మూవీ లో రకుల్ ప్రీత్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " మూవీ తెలుగు రీమేక్ గా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'బిగ్ బాస్ 4' షూటింగ్ మొదలుపెట్టిన నాగార్జున..!
అసలే లాక్ డౌన్.. అందరూ ఇంట్లోనే ఉన్నారు.. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇన్ని రోజులు సీరియల్స్.. ప్రోగ్రామ్స్ కు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే చిన్నగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి కరోనా వల్ల ఈ యేడాది ఎప్పుడో మొదలవ్వాల్సిన బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యం అయింది. లేట్ అయినా.. లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ సిబ్బంది సిద్దమవుతున్నారట.
త్రోబ్యాక్ మ్యాజికల్ డే -అఖిల్ అక్కినేని
యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ జరుగుతుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. సీనియర్ హీరోయిన్ ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
పేద రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన వల్లే ఇలా ఉన్నాం..!
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ కూడా ఒకరు.. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు.. మరి ఈ రోజు వీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే దానికి ఆనాటి లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య అని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు సినీ ఇండస్ట్రీలో అల్లు బ్రాండ్ అంత స్ట్రాంగ్ గా ఉండటానికి ఆయనే కారణం. ఎన్నో చిత్రాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ రోజుల్లో వెండితెరపై అల్లు రామలింగయ్యను మించిన కమెడియన్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు.
"ఫ్రెండ్ షిప్ "మూవీ గ్లింప్స్ వీడియో రిలీజ్
సీన్ టో స్టూడియోస్ , సినిమాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ , శ్యామ్ సూర్య సంయుక్త దర్శకత్వంలో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా తమిళ , తెలుగు , హిందీ భాషలలో "ఫ్రెండ్ షిప్ "మూవీ రూపొందుతుంది. లోస్లియా మరియనేసన్ కథానాయిక. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు మహేష్. వైజయంతి బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ అతిధి పాత్రలో చేయడం విశేషం.ఇక ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో (2020 జులై 30) 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బంధం సహా హీరో మహేష్ బాబు ఈ సినిమా యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కియారా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు
"ఫగ్లీ " మూవీ తో బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ ప్రారంభించారు. కియారా హీరోయిన్ గా నటించిన "MS ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ " మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి తన అందం , అభినయం తో కియారా అద్వానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " తో కియారా స్టార్ హీరోయిన్ గా మారారు. "కబీర్ సింగ్ " మూవీ రికార్డ్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా నటించిన "గుడ్ న్యూస్ " మూవీ ఘనవిజయం సాధించింది.
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

11 వసంతాల "మగధీర "
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా "మగధీర " మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీహరి , దేవ్ గిల్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "పంచదార బొమ్మ "సాంగ్ హైలైట్ గా నిలిచింది. "మగధీర " మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ అందుకుంది.
'మగధీర' - ఆ సీన్ కోసం మారుతి వ్యాన్ టాప్ కట్ చేసిన జక్కన్న..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో 'మగధీర' సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పడు ఒక సినిమా థియేటర్లో రెండు మూడు వారాలు ఆడితేనే పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమా అప్పట్లో.. 299 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 223 కేంద్రాలలో 100…
అప్పట్లో ఇలా.. యాక్టర్ అయిపోదామనుకున్నా..!
సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అంత సులువేం కాదు. ఒకవేళ ఏదో ఒకరకంగా వచ్చినా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. హార్డ్ వర్క్ తో పాటు లక్.. లక్ తోపాటు టాలెంట్ ఇలా అన్నీ ఒకదానికొకటి కలిసొస్తేనే తప్పా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా సోనూ సూద్ ట్విట్టర్ లో తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ తనపై తానే కామెడీ చేసుకున్నాడు. హేండ్సప్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు సోను సూద్. 'సూపర్' చిత్రం తొలి బ్రేక్‌నిస్తే.. 'అరుంధతి' చిత్రం సోనూ సూద్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. ఆ తరువాత పలు తెలుగు చిత్రాలలో విలన్‌గా…
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ
పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై వి. రామచంద్ర రావు దర్శకత్వంలో హీరో కృష్ణ కథానాయకుడిగా బ్రిటిష్ సామ్రాజ్యం పై పోరాటం జరిపిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ "అల్లూరి సీతారామరాజు " 1974 సంవత్సరం మే 1 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. విజయ నిర్మల , జగ్గయ్య , చంద్ర మోహన్ , కాంతారావు , బాలయ్య , ప్రభాకర్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు.
'ఘర్షణ' సీక్వెల్ కావాలా?
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్.. ఆసిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఘర్షణ సినిమా అప్పట్లో ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను తమిళంలో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘కాక కాక’ మూవీకి రీమేక్. తమిళంలో సూర్య, జ్యోతిక పోసించిన పాత్రలను తెలుగులో వెంకటేష్, అసిన్‌లు చేసారు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా రిలీజై నేటికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను గుర్తుచేసుకున్నారు రానా.
హ్యాపీ బర్త్ డే - నా ఓటు నీకే బ్రదర్
రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. దీనితో సోనూసూద్ రియల్ హీరో అంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మూవీ అప్ డేట్
సక్సెస్ ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్ "అ !" మూవీ తో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ "కల్కి " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "క్వీన్ " మూవీ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వైవిధ్య కథాంశాలతో మూవీస్ రూపొందించే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు.
కరోనా పై రకుల్ ప్రీత్ స్పందన
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపై కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతుంది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్లిష్ట పరిస్థితులపై రకుల్ స్పందించారు. 2020 సంవత్సరం అంతా ఇబ్బందులతోనే కొనసాగుతుందని , ప్రతీ రోజూ భయాందోళనలతోనే బ్రతకవల్సిన పరిస్థితి ఏర్పడిందని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఎన్నో పాఠాలు నేర్పిందని , ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ తో కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా ను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
'వీడియో గేమ్' కొనడంలో 'మహేష్-సితార' బిజీ..!
సినిమాలు షూటింగ్స్, యాడ్స్ షూటింగ్స్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకు లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. ఇక ఈ ఖాళీ సమయంలో పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి ఆటలు, పాటలు, కుకింగ్, స్విమ్మింగ్ అంటూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో ఎన్నో స్వీట్ మోమోరీస్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు అభిమానులతో కూడా పంచుకుంటూనే వున్నారు. ఇక నమ్రత అయితే మహేష్, గౌతమ్, సితారలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది నమ్రత.
డిటెక్టివ్ పాత్ర లో స్టార్ హీరోయిన్ త్రిష
తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను సుమారు 2దశాబ్దాలుగా అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న త్రిష కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. త్రిష ప్రధాన పాత్రలో రూపొందిన "గర్జన "తమిళ మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. త్రిష ప్రస్తుతం 4 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. త్రిష ఇప్పుడు ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో నటించనున్నారు.
సమంత ఇంటి వ్యవసాయం
కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు.సినీ సెలబ్రిటీస్ తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత తన ఇంటి టెర్రస్ పై ఆర్గానిక్ ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. తనకెంతో సంతోషాన్ని ఇచ్చే వ్యాపకం ఇది అని సమంత చెప్పారు.