ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!

Akkineni Nagarjuna To Work With Garuda Vega Director Praveen Sattaru

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ‘గరుడ వేగ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కింగ్ నాగార్జున తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు.. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =