మెగా కాంపౌండ్ లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే తనకు కాబోయే వరుడు గురించి పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా చైతన్య పనిచేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి పనులు అప్పుడే మొదలైనట్టు తెలుస్తుంది. నిజానికి నిహారిక పెళ్లి వచ్చే ఏడాది అనుకున్నారు కానీ అంత సమయం ఆగకుండానే తొందరగానే పెళ్లి కానిచ్చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిహారిక ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగష్ట్ 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తుంది. ఆగష్ట్ లో ఎంగేజ్ మెంట్ చేసి ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. మరి డిసెంబర్ లోనే చేస్తారా?అంతకన్నా ముందే చేస్తారా?చూడాలి..
ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు కూడా నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: