మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట కొన్ని పరాజయాలే అందుకున్నాడు. ఇక ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్… తొలిప్రేమ,ఎఫ్2 తో కామెడీ యాంగిల్ ను చూపించాడు..గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో కొత్త వరుణ్ తేజ్ ను చూశాం. ఇప్పుటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రలనే పోషించిన వరుణ్ తేజ్ విలనిజం చూపించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మాస్ లుక్, గెటప్, మ్యానరిజం, యాటిట్యూడ్, డైలాగ్స్ డెలివరీ.. అన్నీవరుణ్ కు కరెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. సినిమాలో మిగతా పాత్రలన్ని ఒక ఎత్తయితే వరుణ్ పాత్ర మరో ఎత్తు. స్క్రీన్ మీద అతను ఉన్నంత సేపు వేరే వాళ్ళను చూడటం కష్టమే. వరణ్ తేజ్‌లో ఉన్న మరో యాంగిల్ ను చూపించడంలో హరీష్ శంకర్ కూడా సక్సెస్ అయ్యాడు.
ఇక ఇదిలా ఉండగా వరుణ్ లో ఈ నటన.. హావభావాలు ఇప్పుడు నేర్చుకున్నవి కాదు.. చిన్నప్పటి నుండి తనలో కళ ఉందని అనిపించక తప్పదు పైన ఫొటో చూస్తుంటే. గద్దల కొండ గణేష్ లో ఎక్స్ప్రెషన్ కి.. చిన్నపుడు ఫొటో కోసం తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి పెద్దగా తేడా ఏం లేదు. మొత్తానికి వరుణ్ లో చిన్నప్పటినుండి ఆ టాలెంట్ ఉందన్న సంగతి మాత్రం అర్థమైంది.
కాగా ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: