డాక్టర్ పాత్రలో శృతి హాసన్

Actress Shruti Haasan To Play Doctor In Ravi Teja Upcoming Movie Krack

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నిజ జీవిత సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. గోపీచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో రూపొందిన “డాన్ శీను “, “బలుపు ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్ ” తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముగింపు దశ లో ఉన్న”క్రాక్ ” మూవీ షూటింగ్ కరోనా కారణం గా వాయిదా పడింది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్ డాక్టర్ గా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన 2 పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ , శృతి హాసన్ జంటగా నటించిన “బలుపు “మూవీ ఘనవిజయం సాధించింది. 7 సంవత్సరాల తరువాత “క్రాక్ ” మూవీ లో రవితేజ , శృతి హాసన్ జంటగా నటించడం విశేషం. ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. “క్రాక్ ” మూవీ తరువాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + sixteen =