కరోనా వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో వర్కౌట్స్ , వంటలు, ఆన్ లైన్ క్లాసులు వింటూ టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమ అభిమానులకు కూడా చేరువగా ఉంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ లాక్ డౌన్ లో ఎన్నో ఛాలెంజ్ లు చూసాం. `బి ది రియల్ మేన్`, `నో మేకప్`, `గ్రీన్ ఇండియా` ఇలా పలు ఛాలెంజ్‌లు తెరపైకి వచ్చాయి. ఇక ఈ ఛాలెంజ్ లలో మన సెలబ్రిటీస్ కూడా పాల్గొని తమ భాద్యతలను నిర్వర్తించారు. ఇక తాజాగా మరో ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే `బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్`. ‘ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్’ అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇంతకీ ఈ ఛాలెంజ్ ఉద్దేశం ఏంటంటే మహిళల్లోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఇప్పటికే చాలా మంది ఈ ఛాలెంజ్ లో పాల్గొని తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్స్ పై ఓ లుక్కేద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: