శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ” మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా ను ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన ఇలియానా ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ లో ముఖ్య పాత్రలకు తెలుగు , తమిళ , మలయాళ భాషల నటీ నటులను ఎంపిక చేయనున్నారని సమాచారం . ఏషియన్ గ్రూప్ నారాయణ్ దాస్ నారంగ్ , పి. రామ్మోహనరావు , శరత్ మరార్ నిర్మాతలు. హీరో నాగార్జున ప్రస్తుతం “వైల్డ్ డాగ్ “(తెలుగు ), “బ్రహ్మాస్త్ర “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: