మిహికాను పెళ్లిచేసుకోవడం నా లైఫ్ లోనే బెస్ట్ టైమ్..!

Getting Married To Miheeka Bajaj Is The Memorable Moment Of My Life Says Bahubali Fame Actor Rana Daggubati

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే ట్యాగ్ నుండి ఇప్పటికే నితిన్ బయటపడిపోయాడు. ఇక ఈ లిస్ట్ లో నుండి రానా కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చేయనున్నాడు. ఇప్పటికే రానా – మిహికాతో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోగా ఆగష్ట్ లో మిహికా మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఇక ఈ సందర్భంగా తన పెళ్లి గురించి, మిహికా గురించి మాట్లాడుతూ రానా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని నెలల ముందే మిహికాతో కనెక్ట్‌ అయ్యాను… అప్పుడే లైఫ్‌లాంగ్‌ ఆమెతో సంతోషంగా ఉంటానని అర్థమయ్యింది… ఫోన్‌లో నేను ఏం అడగబోతున్నానో తనకు తెలుసు. అందుకే పర్సనల్ గా కలిసి ముందు కొన్ని మంచి విషయాలు చెప్పి ఆ తర్వాత నా ఒపీనియన్ చెప్పాను..తను మొదట షాక్‌ అయ్యింది.. కానీ హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పారు.

ఇంకా రానా మాట్లాడుతూ… పెళ్లి చేసుకోవాడానికి ఇదే కరెక్ట్ టైం. పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చేసింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మిహికా, మేం ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లం. మా ఇంటి నుంచి తన ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే.. ఇద్దరం చాలా దగ్గర్లోనే ఉంటాం. జీవితంలో కొన్ని విషయాలు సజావుగా సాగిపోతుంటాయి… అలాంటప్పుడు నేను వాటి గురించి ఎలాంటి ప్రశ్నలు అడగను. తను చాలా మంచిది. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఇద్దరం చాలా పాజిటివ్ గా ఉంటాం.. ఆగస్టు 8న నేను వివాహం చేసుకోబోతున్నాను. మిహికాతో వివాహం జరగడం అనేది నా లైఫ్ లోనే చాలా బెస్ట్ టైం అని చెప్పాడు.

ఇక రానా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. దీనితో పాటు అరణ్య సినిమా కూడా చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.