కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పై దృష్టి సారించారు. ప్రముఖ నిర్మాతలు , దర్శకులు కూడా వెబ్ సిరీస్ రూపొందించడానికై ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత , శృతి హాసన్ వెబ్ సిరీస్ లలో నటించగా కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వెబ్ సిరీస్ లను ఓకే చేశారు. తన మనసు నచ్చే మూవీస్ను ఎంపిక చేసుకొనే ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “ఆడుకాలం”, “అసురన్ ” మూవీస్ ఫేమ్, బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న వెట్రిమారన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , సాయి పల్లవి ప్రధాన పాత్రలలో పరువు హత్య నేపథ్యం లో ఒక తమిళ వెబ్ సిరీస్ రూపొందనుంది. సామాజిక అంశాలతో , వాస్తవికత ప్రతిబింబించేలా మూవీస్ రూపొందించే వెట్రిమారన్ వెబ్ సిరీస్ కు అడిగిన వెంటనే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయి పల్లవి ప్రస్తుతం రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న “విరాటపర్వం “, నాగచైతన్య హీరోగా రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: