ఇండిపెండెన్స్ రోజు ఆ జెండాలను వాడుదాం..!

Tollywood Actor Sai Dharam Tej Urges Everyone To Celebrate This Independence Day With Bio Degradable Flags

కేవలం సినిమాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే విషయాల్లో కూడా మన టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఎప్పుడూ ముందుకొస్తునే ఉంటారు. ఇప్పటికే కరోనాపై తమకు తోచిన సలహాలు, సూచనలు ఇచ్చారు ప్రజలకు. ఇక ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్లాంటబుల్ ఫ్లాగ్ సీడ్‌ను రూపొందించారని, వాటినే జెండాలుగా వాడాలని అందరికీ సూచిస్తున్నారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. ఇప్పటికే ఎంతో మంది దీనిపై స్పందించగా… తాజాగా సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనమంతా మన దేశ భక్తిని చాటి చెప్పేందకు బయో డీగ్రేడబుల్ జెండాను వాడుదాం. వాటిని తిరిగి మనం మొక్కలుగా మార్చొచ్చు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడేందుకు చేతులు కలుపుదాం. గ్రీన్ కామ్రేడ్, గ్రీన్ వేవ్స్ అనే సంస్థలు ఈ పద్దతిని ముందుకు తీసుకు వచ్చాయ’ని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఈ ప్లాంటబుల్ సీడ్ ఫ్లాగ్‌ ప్రాసెస్ ఏంటంటే… మూడు రోజులు నీటిలో నానా బెట్టాలి.. ఆ తర్వాత నేలలో పాతి పెట్టి.. రోజూ నీళ్లు పోయాలి. అందులో ఉన్న పేపర్ బయో డీగ్రేడ్ అవుతాయి.. విత్తనం మొలకెత్తడానికి దాదాపు మూడు వారాలు పట్టొచ్చు.

‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో సినిమాను లైన్ లో పెట్టాడు జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా సినిమా రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =