‘కోబ్రా’ – ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్..?

Cricketer Irfan Pathan To Play Interpol Officer In Chiyaan Vikram Cobra Movie

జయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ‘కోబ్రా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్పుడు తీసుకున్న పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన పాత్ర గురించి చెప్పాడు. కొల్‌కత్తాలో జరిగిన ‘కోబ్రా’ చిత్ర షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోను ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి. తాను ఒక ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా చిత్రంలో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. మరి క్రికెటర్‌గా రాణించిన ఇర్ఫాన్‌ పఠాన్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి చూద్దాం ఇర్ఫాన్ పాత్ర ఎలా వుండబోతుందో..ఎలా నటిస్తాడో..!

 

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరి అపరిచితుడు అనంతరం ఎన్నో సినిమాలు చేసిన విక్రమ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి చూద్దాం ఎంతవరకూ హిట్ కొడతాడో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =