కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 144

సినిమా వార్తలు

కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ "సీటీ మార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
Super Krishna's Blockbuster Movie Mama Allulla Saval Completes 40 Years
సినిమా వార్తలు

కృష్ణ ‘మామా అల్లుళ్ళ స‌వాల్‌’కు 40 ఏళ్ళు

తెలుగునాట కొన్ని కాంబినేష‌న్స్ సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాదు.. చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. అటువంటి గ్రేట్ కాంబినేష‌న్స్‌లో ఒక‌టి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, కె.య‌స్.ఆర్.దాస్‌ది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన వీరిద్ద‌రి సినీ ప్ర‌యాణంలో.. 30కి పైగానే సినిమాలు తెర‌కెక్కాయి. అంతేకాదు.. సింహ‌భాగం విజ‌యాల‌ను సాధించాయి కూడా. అలాంటి చిత్రాలలో ‘మామా అల్లుళ్ళ స‌వాల్’ ఒక‌టి. కృష్ణ‌, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, జ‌మున‌, చంద్ర‌మోహ‌న్, ప్ర‌భాక‌ర రెడ్డి, అల్లు రామ‌లింగ‌య్య‌, ర‌మాప్ర‌భ, నిర్మ‌ల‌, జ‌య‌మాలిని ముఖ్య భూమిక‌లు పోషించారు. ఈ సినిమాకి యం.డి.సుంద‌ర్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏయ‌న్నార్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మ‌రో ప్ర‌పంచం’కు 50 ఏళ్ళు

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప‌లు సందేశాత్మ‌క చిత్రాల‌లో న‌టించారు. అలాంటి వాటిలో ‘మ‌రో ప్రపంచం’ ఒక‌టి. కులం, మ‌తం, అసూయ‌, ద్వేషం, బాధ‌లు లేని ఓ కొత్త ప్ర‌పంచాన్ని ఈ స‌మ‌కాలీన స‌మాజానికి ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. ఇందులో ఏయ‌న్నార్, సావిత్రి జంట‌గా న‌టించ‌గా.. జ‌మున‌, గుమ్మ‌డి, ప‌ద్మ‌నాభం, సాక్షి రంగారావు, విజ‌య్‌చంద‌ర్, మాడా, పుష్ప‌కుమారి, రాధాకుమారి, మీనాకుమారి, సూర్య‌కాంతం ముఖ్య పాత్ర‌లు పోషించారు. మ‌హాత్మా గాంధీ శ‌త‌జ‌యంతి సందర్భంగా రూపొందిన ఈ చిత్రాన్ని లెజెండ‌రీ డైరెక్ట‌ర్ ఆదుర్తి సుబ్బారావు తెర‌కెక్కించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నర్సింగ్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత

"హేమాహేమీలు " మూవీ తో నర్సింగ్ యాదవ్ సపోర్టింగ్ విలన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు,తమిళ, హిందీ భాషలలో సుమారు 300 చిత్రాలలో విలన్ , కామెడీ విలన్, ఇన్నోసెంట్ విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. క్షణ క్షణం, గాయం, ముఠా మేస్త్రి, మాస్ , శంకర్ దాదా MBBS, ఠాగూర్ , పోకిరి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నర్సింగ్ యాదవ్ గుర్తింపు పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణకి విల‌న్‌గా భూమిక‌?

భూమికా చావ్లా.. నిన్నటి తరం అగ్ర కథానాయిక. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందిరితోనూ ఆడి పాడిన వైనం భూమిక సొంతం. అయితే బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయింది. కాకపోతే బాలయ్య గత చిత్రం ‘రూలర్’లో కీలక పాత్రలో కనిపించింది భూమిక. కట్ చేస్తే.. బాలయ్య తాజా చిత్రంలోనూ భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందని సమాచారం. కాగా, ఈ సారి విలన్ పాత్రలో ఆమె దర్శనమివ్వనుందని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ 50వ చిత్రం ‘వాసు’కి 18 ఏళ్ళు

“పాడ‌నా తీయ‌గా క‌మ్మ‌ని ఒక పాట‌.. పాట‌గా బ్ర‌త‌క‌నా మీ అంద‌రి నోట‌”.. ఇలా కోరుకునే ఒక గాయ‌కుడి క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రమే ‘వాసు’. విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించారు. వెంకీకి జోడీగా భూమికా చావ్లా న‌టించగా.. విజ‌య‌కుమార్, మంజుల‌, సునీల్, అలీ, అచ్యుత్, వ‌ర్ష, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, రంగ‌నాథ్, బ్ర‌హ్మాజీ, రఘునాథ రెడ్డి ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘లూసిఫర్’ రీమేక్‌కి డైరెక్టర్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడా?

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘రన్ రాజా రన్’(2014)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు సుజిత్. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆపై మలి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసాడు. ‘సాహో’(2019) పేరుతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ దర్శకుడిగా సుజిత్‌కు మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సుజిత్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ చేరుతోందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సాంగ్

ఇక రీమిక్స్ చేయను..!

ఇకపై రీమిక్స్ లు జోలికి వెళ్లనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. పాపం అంతలా ఎం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోడానికి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్... మొదటి నుండి కాస్త తన మేన మామలు చిరంజీవిని, పవన్ ను అనుకరిస్తూనే ఉండేవాడు.. అంతే కాదు తన సినిమాల్లో మామ చిరు పాట ఒక్కటైనా రీమిక్స్ ఉండేలా చూసేవాడు. దీనితో సాయితేజ్ అలా చేయడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయితేజ్ దీనిపై స్పందించి...ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరోలను మించి రాఘవ లారెన్స్ విరాళం..!

కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల వల్ల పేదలు కాస్త సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వారికి సాయం చేయడం కోసం ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. పేదలకు.. రోజూ కూలి పనులు చేసుకునే వారికి ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కొరియో గ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా విరాళం అందించారు. సినిమా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. తన సంపాదనలో చాలా వరకు ఓ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి అందులో విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తుంటాడు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించాడు లారెన్స్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇండియా ను టార్గెట్ చేసిన 4 టాలీవుడ్ మూవీస్

భారతీయ చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తూ, దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించేలా 4 టాలీవుడ్ మూవీస్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీతో తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు, తమిళ, హిందీ బాషలలో #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "సాహో " మూవీ ఘనవిజయంతో#Prabhas 20 మూవీ పై ఉత్తరాది లో కూడా క్రేజ్ నెలకొంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూర్వ స్థితికి చేరుకుంటాం - చిరంజీవి

కరోనా మహమ్మారి కారణంగా పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ బంద్ కావడం , థియేటర్స్ మూతపడటం, కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా సంక్షోభం లో చిక్కుకుంది. మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ గురించి, చిత్ర పరిశ్రమ నష్టాల గురించితన అప్ కమింగ్ మూవీ "ఆచార్య" గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా వైరస్ గురించి, చాల వేగంగా ఇతర దేశాలలో వ్యాపించడం గురించి చదివిన చిరంజీవి దర్శకుడు శివ తో చర్చించి "ఆచార్య" మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. ఆరోజే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్స్ మూసివేయాలని ప్రభుత్వం…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్రిష తప్పుకోవడానికి కారణం అదే..!

మొత్తానికి చిరు ఈమధ్య ఒకదాని తర్వాత ఒకటి నిజాలు మొత్తం బయటకు చెప్పేస్తున్నారు. పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టైటిల్ ను చెప్పి నోరు జారారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఉంటాడా..?చరణ్ ఉంటాడా? అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపై చిరుని అడుగగా... అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు...మొదటి నుండి ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో బిజీ గా వున్నాడు... మొదటి నుండి అనుమానం ఉంది...రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే... ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు... లేకపోతే కుదరకపోవచ్చు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈసారి టైటిల్ తోనే మొదలుపెట్టాడుగా బన్నీ..!

సుకుమార్ సినిమాతో కూడా అల్లు అర్జున్ అప్పుడే సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో పాటలు రూపంలో పలు రికార్డ్స్ క్రియేట్ చేసాడు బన్నీ. ఆ సినిమా హిట్ లో సగభాగం మ్యూజిక్ దే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక పుష్ప అనే టైటిల్...బన్నీ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. గుబురుగడ్డం, మెడకు నల్ల తాడు, డీ గ్లామర్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ను ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. దీనితో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ పోలీసులకు మహేష్ థ్యాంక్స్..!

కరోనా వైరస్ ను అరికట్టేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించి అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో నిత్యావసర వస్తువులు.. ఎమర్జెన్సీ అయితేనే కానీ బయటకు పంపించని పరిస్థితి. ఇక ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా గృహ నిర్బంధంలో వుంటున్నారు. ఇక ఈ కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడుతున్న వారు ఎవరైనా వున్నారంటే వాళ్ళు డాక్టర్స్, నర్సులు, పోలీసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకపక్క వైద్యులు వైరస్ బాధితులను కాపాడటానికి చికిత్స చేస్తుంటే మరోపక్క పోలీసులు ప్రజలు బయట తిరగకుండా... ఎవరికీ వైరస్ అంటకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. వారి చేస్తున్న ఈ సేవలకు మనం…

TFN Adminవాట్సాప్
April 9th Marks Lucky Date For Megastar Chiranjeevi Movies
సినిమా వార్తలు

ఏప్రిల్ 9 కేరాఫ్ మెగాస్టార్ మెమ‌ర‌బుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్

మెగాస్టార్ చిరంజీవికి బాగా క‌లిసొచ్చిన తేదీల్లో ఏప్రిల్ 9 ఒక‌టి. గతంలో ఇదే రోజున వేర్వేరు సంవ‌త్స‌రాల్లో చిరు నటించిన రెండు చిత్రాలు విడుద‌ల కాగా.. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టుడిగా త‌న‌కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఆ చిత్రాలే.. `ఘ‌రానా మొగుడు’, `బావగారూ...బాగున్నారా!`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ను నయం చేస్తా - నిధి అగర్వాల్

"సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ తో విజయం సాధించారు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఇస్మార్ట్ గర్ల్ నిధి తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పాంటేనియస్ గా జవాబులు చెబుతూ అభిమానులను ఫిదా చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క ఎమోషనల్ ఫీలింగ్స్

కరోనా మహమ్మారి తో ప్రపంచం అల్లకల్లోమయ్యింది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా జనజీవనం కష్టాల పాలయ్యింది. దేశం కూడా ఆర్థికంగా వెనుకబడిపోతుంది. సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రత తో కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవచ్చుననే ఆలోచనతో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో స్టార్ హీరోయిన్ అనుష్క తన ఎమోషనల్ ఫీలింగ్స్ ను వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Thanks His Fans On His Birthday
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు థ్యాంక్స్ - అఖిల్ అక్కినేని

ఏప్రిల్ 8వ తేదీ బర్త్ డే జరుపుకున్న అఖిల్ అక్కినేని బర్త్ డే విషెస్ తెలిపిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయొద్దని అభిమానులకు చెప్పిన అఖిల్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అని, త్వరలోనే కరోనా కష్టాలనుండి బయట పడతామని, స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు సినిమాలో మ‌రోమారు నిహారిక‌?

మెగాస్టార్ చిరంజీవి గ‌త చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`లో గిరిజ‌న యువతిగా కనిపించింది మెగా డాట‌ర్ నిహారిక‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చిరుతో మ‌రోమారు స్క్రీన్ షేర్ చేసుకోనుంద‌ని టాక్.

Team TFNవాట్సాప్

షేర్