ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 143

అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’కు 6 ఏళ్ళు
మాస్క్ అప్ , స్టే సేఫ్ - లావణ్య త్రిపాఠి
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఐడియా

విజయశాంతి ‘పడమటి సంధ్యారాగం’కు 33 ఏళ్ళు
"పుష్ప" మూవీ లో విలన్ గా బాలీవుడ్ హీరో ?

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
గురుశిష్యులుగా చిరు, చరణ్
విజయ్ 'మాస్టర్' ను లాక్ డౌన్ ఆపలేదు..!
టాలీవుడ్ లో మహేష్ బాబే నా క్రష్..!
బన్నీ పై కేరళ సీఎం ప్రశంసలు..!

కన్నడ రీమేక్ కు 'ఎవరు'..!
కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?
మూవీ పై రూమర్స్ ను నమ్మవద్దు - నిర్మాత
'వకీల్ సాబ్' లో నేను నటించట్లేదు..!
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!
'కరోనా' పోరులో మెగా మదర్ సాయం 700 మాస్క్ లు తయారు
రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భద్రతా భాద్యతలను కట్టుదిట్టం చేసాయి. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు.

అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’కు 6 ఏళ్ళు
“టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘రేసుగుర్రం’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ ముఖ్య భూమికలు పోషించారు.
మాస్క్ అప్ , స్టే సేఫ్ - లావణ్య త్రిపాఠి
"అందాల రాక్షసి" లావణ్య త్రిపాఠి కరోనా రక్కసి నుండి రక్షణ కై ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని పిలుపునిచ్చారు. షూటింగ్స్ రద్దు అయిన కారణంగా పేద సినీ కార్మికుల కష్టాలకు స్పందించి కరోనా క్రైసిస్ ఛారిటీ కి విరాళమందించిన మొదటి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు కరోనా వ్యాప్తి నివారణ కై మాస్క్ లు తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందజేసే కార్యక్రమం ప్రారంభించారు.
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఐడియా
ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం కష్టాలపాలయింది. దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ప్రజలకు తమవంతు సాయంగా సినీ సెలబ్రిటీస్ PM, CM సహాయ నిధులకు విరాళాలు అం దిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంటి సభ్యులతో కలసి తమ ఇంటి సమీపంలో ఉన్న స్లమ్ఏరియాలో 250 కుటుంబాలకు ఆహరం అందిస్తున్నారు. రకుల్ ఇప్పుడు PM కేర్స్ ఫండ్ కై ఒక కొత్త ఐడియా ప్లాన్ చేశారు.

విజయశాంతి ‘పడమటి సంధ్యారాగం’కు 33 ఏళ్ళు
“ప్రేమకు కులం, మతమే కాదు ఎల్లలు కూడా లేవ”ని చాటి చెప్పిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, హాలీవుడ్ యాక్టర్ టామ్ జానే జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను “హాస్యబ్రహ్మ” జంధ్యాల తెరకెక్కించారు. సుధేష్ణ, “డ్రమ్మర్” శివమణి, “సుత్తి” వేలు, సుధ, గుమ్మలూరి శాస్త్రి, శేషగిరిరావు, విజయ్, ఆశాజ్యోతి, రవి చిట్టూరి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన “డ్రమ్మర్” శివమణితో పాటు.. టామ్ జానే కూడా ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. అంతేకాదు.. తొంభై శాతం అమెరికాలో నిర్మితమైన తొలి తెలుగు చిత్రంగా కూడా ‘పడమటి సంధ్యారాగం’…
‘పుష్ప’ కోసం ఐటమ్, టైటిల్ సాంగ్ రెడీ?
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ చిత్రం కూడా పాటల పరంగా డిజప్పాయింట్ చేసిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా.. ఐటమ్ సాంగ్ విషయంలో. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని మినహా ఇస్తే.. సుక్కు, దేవిశ్రీ కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అ అంటే అమలాపురం”(‘ఆర్య’), “36,26,36”(‘జగడం’), “రింగ రింగ”(‘ఆర్య2’), “డియ్యాలో డియ్యాలా”(‘100% లవ్’), “లండన్ బాబు”(‘1: నేనొక్కడినే’), “జిగేల్ రాణి”(‘రంగస్థలం’).. ఇలా ప్రతీ ‘ప్రత్యేక గీతం’…
"పుష్ప" మూవీ లో విలన్ గా బాలీవుడ్ హీరో ?
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ "పుష్ప" రూపొందుతున్న విషయం తెలిసిందే. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "పుష్ప" మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అరవింద సమేత’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అరవింద సమేత’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం రణం రుధిరం’) ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం తరువాత తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే…
గురుశిష్యులుగా చిరు, చరణ్
రియల్ లైఫ్ తండ్రీకొడుకులు.. రీల్ లైఫ్‌లో అన్నదమ్ములుగానో లేదా తండ్రీకొడుకులుగానో కనిపించడం షరా మామూలే. అయితే గురుశిష్యుల పాత్రల్లో దర్శనం ఇవ్వడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలవనుంది మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’.
త్రివిక్రమ్ గారు అప్పుడే చెప్పారు.. అదే నిజమైంది..!
త్రివిక్రమ్ గారు చెప్పిందే జరిగిందని చెపుతుంది యాంకర్ శ్రీముఖి. మరి త్రివిక్రమ్ ఏం చెప్పారు...ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 'జులాయి' సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శ్రీముఖి. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించి.. ఇప్పుడు పూర్తిస్థాయి యాంకర్ గా నిలిచింది. ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకటి. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీముఖి తన సినీ కెరీర్ గురించి.. సినిమాలు ఆపేసి యాంకరింగ్ నే ఎందుకు కంటిన్యూ చేసింది అన్న విషాలు చెప్పుకొచ్చింది.
విజయ్ 'మాస్టర్' ను లాక్ డౌన్ ఆపలేదు..!
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నిజానికి ఈ సినిమా ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది కానీ తెలిసిన విషయమే కదా... లాక్ డౌన్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో ‘మాస్టర్’ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో ‘మాస్టర్’ను మీరు చూస్తారు అని ఈ పోస్టర్ పై తెలిపారు. దీన్నిబట్టి ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేస్తారేమో అని…
టాలీవుడ్ లో మహేష్ బాబే నా క్రష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రిన్స్ అనే మాటకు కరెక్ట్ గా సూటయ్యే పర్సనాలిటీ మహేష్ ది. 'రాజకుమారుడు' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా అయ్యాడు. ఇక సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది మహేష్ కు ఫ్యాన్స్ వున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆ విషయంమనం చూసాం. ఇక ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీకూడా మహేష్ అంటే తనకు క్రష్ అంటుంది. ఆమె ఎవరో కాదు. హంసా నందిని.
బన్నీ పై కేరళ సీఎం ప్రశంసలు..!
కరోనా నివారణ చర్యల్లో భాగంగా... అల్లు అర్జున్ తనవంతుగా కోటి 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రూ. 50 లక్షల చొప్పను, కేరళకు రూ. 25 లక్షలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బన్నీకి కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ చేసిన సాయానికి కేరళ పినరాయి విజయన్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని.... తెలుగు రాష్ట్రాలతో సమానంగా కేరళకు కూడా సాయం అందించాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఇక గతంలో కూడా కేరళలో ప్రతిష్టాత్మక ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’కు బన్నీని సీఎం విజయన్ ప్రత్యేకంగా ఆహ్వానించి…

కన్నడ రీమేక్ కు 'ఎవరు'..!
సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’న'ఎవరు' వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది 'ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో... ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ రెజీనా నటన. నెగెటివ్…
కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దయి రోజు వారీ జీతాలపై బ్రతికే పేద కళాకారులు, కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కొంతమంది సినీప్రముఖులతో డిస్కస్ చేసి కరోనా క్రైసిస్ చారిటీ నెలకొల్పి , తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కరోనా క్రైసిస్ ఛారిటీ కి 3 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకటించారు.
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా... రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే…
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?
రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "విరాటపర్వం" మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.
మూవీ పై రూమర్స్ ను నమ్మవద్దు - నిర్మాత
శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా " మూవీ రూపొందిన విషయం తెలిసిందే. హెబ్బా పటేల్, వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ , సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
'వకీల్ సాబ్' లో నేను నటించట్లేదు..!
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. ఇక కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ... అది కూడా వాయిదా పడనుంది.
పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే...ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.