భూమికా చావ్లా.. నిన్నటి తరం అగ్ర కథానాయిక. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందిరితోనూ ఆడి పాడిన వైనం భూమిక సొంతం. అయితే బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయింది. కాకపోతే బాలయ్య గత చిత్రం ‘రూలర్’లో కీలక పాత్రలో కనిపించింది భూమిక. కట్ చేస్తే.. బాలయ్య తాజా చిత్రంలోనూ భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందని సమాచారం. కాగా, ఈ సారి విలన్ పాత్రలో ఆమె దర్శనమివ్వనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘సింహా’, ‘లెజెండ్’ తరువాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ఉందట. ఆ పాత్రలో భూమికను నటింపచేసే ప్రయత్నం జరుగుతోందని ఫిల్మ్‌నగర్ ఇన్ఫర్మేషన్. కాగా, ఇప్పటికే తను ఓ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్టు భూమిక వెల్లడించింది. బహుశా ఆ సినిమానే ‘యన్.బి.కె.106’ కావొచ్చని టాలీవుడ్ టాక్.




మరి.. ‘మిస్సమ్మ’లో నెగెటివ్ టచ్ ఉన్న రోల్‌లో మెస్మరైజ్ చేసిన భూమిక.. ఈ సారి అవుట్ అండ్ అవుట్ విలన్ రోల్‌లో ఏ స్థాయిలో మురిపిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: