యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన “భీష్మ” మూవీ ఘనవిజయం సాధించింది. “భీష్మ” మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే” మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన “అంధాధున్” హిందీ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తోఘనవిజయం సాధించింది. ఠాగూర్ మధు సమర్పణ లో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ రూపొందనుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ ఎంపిక అయ్యారని సమాచారం. పాండిచ్చేరి లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: