కరోనా ను నయం చేస్తా – నిధి అగర్వాల్

I Wish To Cure Corona Virus If I Have Magical Powers Says Actress Nidhhi Agerwal

“సవ్యసాచి ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తో విజయం సాధించారు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఇస్మార్ట్ గర్ల్ నిధి తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పాంటేనియస్ గా జవాబులు చెబుతూ అభిమానులను ఫిదా చేశారు.

తనకు సూపర్ పవర్స్ ఉంటే కరోనా మహమ్మారి ని నయం చేస్తానని, తాను నటించిన మూవీస్ అపజయాలగురించి నిధి మాట్లాడుతూ విజయం తో చంపేస్తా, నవ్వుతో పూడ్చేస్తా అన్నారు. “బంగారం”అంటూ అభిమానులపై తన అభిప్రాయం చెప్పారు. హీరో రామ్ గురించి “డబుల్ దిమాక్” అంటూ వ్యాఖ్యానించారు. నిధి తన గురించి చెబుతూ నిత్యం ధ్యానం చేస్తానని, యానిమల్ లవర్ నని, ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. “భూమి “మూవీ తో కోలీవుడ్, “జేమ్స్ ” మూవీ తో శాండల్ వుడ్ కు నిధి అగర్వాల్ పరిచయం కానున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here