ఏప్రిల్ 9 కేరాఫ్ మెగాస్టార్ మెమ‌ర‌బుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్

April 9th Marks Lucky Date For Megastar Chiranjeevi Movies

మెగాస్టార్ చిరంజీవికి బాగా క‌లిసొచ్చిన తేదీల్లో ఏప్రిల్ 9 ఒక‌టి. గతంలో ఇదే రోజున వేర్వేరు సంవ‌త్స‌రాల్లో చిరు నటించిన రెండు చిత్రాలు విడుద‌ల కాగా.. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టుడిగా త‌న‌కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఆ చిత్రాలే.. `ఘ‌రానా మొగుడు’, `బావగారూ…బాగున్నారా!`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`ఘ‌రానా మొగుడు’(1992) విష‌యానికి వ‌స్తే… చిరంజీవి, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇది. చిరంజీవి, న‌గ్మా, వాణీవిశ్వ‌నాధ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.దేవీవ‌ర‌ప్ర‌సాద్ నిర్మించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ‘ఘ‌రానా మొగుడు’ అప్పట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్‌గా నిల‌చింది.

ఇక‌.. చిరు క‌థానాయ‌కుడిగా జ‌యంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బావ‌గారూ…బాగున్నారా!’(1998) కూడా ఇదే తేదిన విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిల‌చింది. అంతేకాదు.. చిరంజీవి హోమ్ బ్యాన‌ర్ అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో వ‌చ్చిన తొలి సూప‌ర్ హిట్ మూవీ ఇదే కావ‌డం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 12 =