అనుష్క ఎమోషనల్ ఫీలింగ్స్

Actress Anushka Shetty Pens Heart Felt Note On Corona Crisis

కరోనా మహమ్మారి తో ప్రపంచం అల్లకల్లోమయ్యింది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా జనజీవనం కష్టాల పాలయ్యింది. దేశం కూడా ఆర్థికంగా వెనుకబడిపోతుంది. సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రత తో కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవచ్చుననే ఆలోచనతో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో స్టార్ హీరోయిన్ అనుష్క తన ఎమోషనల్ ఫీలింగ్స్ ను వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన విరామం లో కొత్త కోణాలు దర్శించిన అనుభూతి కలుగుతుందని, అందరూ విభజించబడినట్టుగా, ఎవరికి వారు ఒంటరి అయినట్టుగా ఉందని, ప్రజలంతా ఐక్యంగా నిలవడం స్ఫూర్తి నిస్తుందని, కరోనా వ్యాధి నివారణకై ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలని, మనలను కాపాడటానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడి సేవలందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపడానికి మాటలు సరిపోవని, ప్రతీ వ్యక్తి అందరి క్షేమంకోసం పాటుపడే సందర్భం ఇదని అనుష్క తన ఫీలింగ్స్ ను తెలిపారు. ఇక స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” విడుదలకు సిద్ధంగా ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here