“హేమాహేమీలు ” మూవీ తో నర్సింగ్ యాదవ్ సపోర్టింగ్ విలన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు,తమిళ, హిందీ భాషలలో సుమారు 300 చిత్రాలలో విలన్ , కామెడీ విలన్, ఇన్నోసెంట్ విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. క్షణ క్షణం, గాయం, ముఠా మేస్త్రి, మాస్ , శంకర్ దాదా MBBS, ఠాగూర్ , పోకిరి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నర్సింగ్ యాదవ్ గుర్తింపు పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థత తో హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. నిన్న సాయంత్రం అపస్మారక స్థితి లోకి వెళ్ళిన నర్సింగ్ యాదవ్ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని సమాచారం. నర్సింగ్ యాదవ్ వైఫ్ మాట్లాడుతూ .. నర్సింగ్ యాదవ్ కోమా లో ఉన్నారని, వెంటిలేటర్ పై చికిత్స జరుగుతుందని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: