కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల వల్ల పేదలు కాస్త సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వారికి సాయం చేయడం కోసం ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. పేదలకు.. రోజూ కూలి పనులు చేసుకునే వారికి ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కొరియో గ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా విరాళం అందించారు. సినిమా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. తన సంపాదనలో చాలా వరకు ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తుంటాడు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించాడు లారెన్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
3 కోట్ల విరాళంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 లక్షలు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు. ఇక స్టార్ హీరో లు కూడా ఇంత విరాళం ఇవ్వకపోవడంతో అందరూ లారెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
— Raghava Lawrence (@offl_Lawrence) April 9, 2020
కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి2’ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే వీరిద్దరి సినిమా పట్టాలెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: