ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 145

అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’కి 5 ఏళ్ళు
తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!
చరణ్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి..!
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ "పుష్ప "
న్యూ అకౌంట్ తో నివేత పేతురాజ్ ట్విట్టర్ ఎంట్రీ
"పుష్ప" మూవీ మరో పోస్టర్ రిలీజ్

బన్నీ 'ఐకాన్' పై రూమర్లకు చెక్..!
మనవడి కోసం డైరెక్టర్ గా మారిన సూపర్ స్టార్..!

2021 వేసవికి ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్?

లాక్ డౌన్ నేపథ్యంతో ‘ఎఫ్ 3’?

నితిన్ కి విలన్‌గా రమ్యకృష్ణ ?
అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
మరో ప్రయోగాత్మక పాత్రలో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్. 'సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్'... ఇలా పలు బ్లాక్ బస్టర్స్ లో బాలయ్య పలికిన సంభాషణలు ఆయా చిత్రాలకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాంటి బాలయ్య... తొలిసారి డైలాగ్స్ లేని ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

ఏఎన్నార్, నాగార్జున ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 33 ఏళ్ళు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు ‘కింగ్’ నాగార్జున కలయికలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అలా వారి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘కలెక్టర్ గారి అబ్బాయి’. అగ్ర దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. నాగ్‌కు జోడిగా రజిని నటించింది. ఇతర ముఖ్య పాత్రలను ‘ఊర్వశి’ శారద, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, సుత్తివేలు, 'శుభలేఖ' సుధాకర్, పి.ఎల్.నారాయణ, నర్రా వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి, రమాప్రభ తదితరులు పోషించారు.

అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’కి 5 ఏళ్ళు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఒకటి. 'విలువలే ఆస్తి' అనే పాయింట్ తో రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. సమంత, నిత్యమీనన్ కథానాయికలుగా నటించారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిషోర్, స్నేహ, పవిత్ర లోకేష్, ఆదా శర్మ, సింధు తులాని ముఖ్య పాత్రలు పోషించగా.. ప్రకాష్ రాజ్ అతిథి పాత్రలో మెరిసారు.
తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!
మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ ను తల ఎత్తుకునేలా చేశాడట పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా. అంతలా అకీరా ఏం చేశాడానా... ఏం లేదులెండి.. తన తమ్ముడిపై కామెడీ చేశాడు వరుణ్. ఈ రోజు అకీరా పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుణ్ కూడా తన విషెస్ కూడా తెలియచేశాడు అకీరాకి. అయితే కాస్త కామెడీ చేశాడు. హ్యాపీ బర్త్ డే తమ్ముడు.. ఫైనల్లీ నన్ను తల ఎత్తుకునేలా చేసావు.. విష్ యూ ఏ గ్రేట్ ఇయర్ అని ట్వీట్ చేసాడు. మరి మెగా ఫ్యామిలీ లో అందరి కంటే వరుణ్ తేజ్ ఒక్కడే 6 అడుగులు ఉంటాడు. ఇక అకీరా వరుణ్ ను మించిపోయాడు.
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.
చరణ్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి..!
మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆ సినిమా తర్వాత ఇంత వరకూ ఇంకేం సినిమాను ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే మహర్షి తీసిన మహేష్ తోనే మళ్ళీ వంశీ సినిమా ఉంటుందని..జోరుగా వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లోనే సినిమా అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఏమైందో తెలియదు కానీ పరుశురాం లైన్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మహేష్ 'గీత గోవిందం' డైరెక్టర్ పరుశురాం తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ వార్త కన్ఫామ్ అయిపోయింది. మే చివరిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
నేను ఖాళీగా లేను.. వాళ్ళే ఖాళీగా ఉన్నట్టున్నారు..!
సెలెబ్రిటీలపై సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్.. ఏదో ఒక కామెంట్ రావడం కామన్ థింగ్. ఇక ఈ కామెంట్స్ ను కొంత మంది లైట్ తీసుకుంటే.. కొంతమంది మాత్రం సీరియస్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కామెంట్స్ పై సీరియస్ అయింది తమన్నా. అసలు సంగతేంటంటే...తమన్నాకు అవకాశాలు తక్కువ అయ్యాయని...ఖాళీగా ఉందన్న కామెంట్స్ పడ్డాయి. ఇక వీటిపై స్పందించిన తమన్నా..."365 రోజులు నేను బిజీగానే వున్నాను .. వరుసగా ప్రాజెక్టులు వస్తూనే వున్నాయి. నాకు నచ్చిన పాత్రలను నేను ఎంచుకుంటూనే వున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న 'సీటీమార్' షూటింగు దశలో వుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నా ప్లానింగ్ ప్రకారం నేను…
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ "పుష్ప "
విభిన్న కథా చిత్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ "పుష్ప " రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో "పుష్ప " మూవీ రూపొందుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
90%సక్సెస్ రేట్ కలిగిన టాప్ స్టార్ అల్లు అర్జున్ అన్నది నిర్వివాదాంశం
అతను వారసత్వ హీరో అని చెప్పలేము. సాధారణంగా వారసత్వ హీరోలకు తమ తండ్రుల ద్వారా గొప్ప అభిమాన సంపద సంక్రమిస్తుంది. అయితే ఆయన తండ్రి, తాతలు సినీ ప్రముఖులే అయినప్పటికీ వారి పేరు ప్రఖ్యాతుల వల్ల ఇతని కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే నేపథ్యమే తప్ప ఒక వారసత్వ హీరోను ఇంట్రడ్యూస్ చేయటానికి, నిలబెట్టటానికి అవసరమైనంత ప్రత్యేక ప్రయత్నాలు ఏవీ అతని విషయంలో జరగలేదు. అందుకే దశాబ్దాల చరిత్ర ఉన్న సినీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతన్ని వారసత్వ హీరో అనలేము. వారసత్వ హీరో అయి ఉంటే హీరోగా తన మొదటి సినిమా " గంగోత్రి” లో అంత 'అండర్ డాగ్ ' క్యారెక్టర్ చేసేవాడు కాదు. భారీ తారాగణం, భారీ…
సినీ కార్మికులకు, డబ్బింగ్ యూనియన్‌కు సాయికుమార్ సాయం
కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ పేద వారికి, రోజు కూలీలకు చాలా పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచు. అందుకే వారికి సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి తమ భాద్యతగా వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమకు తోచినంత విరాళాలు అందించగా ఇప్పుడు ఈ లిస్ట్ లో సాయికుమార్ ఫ్యామిలీ కూడా చేరింది.
న్యూ అకౌంట్ తో నివేత పేతురాజ్ ట్విట్టర్ ఎంట్రీ
తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నివేత నటించిన "చిత్ర లహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న "RED " మూవీ, 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
"పుష్ప" మూవీ మరో పోస్టర్ రిలీజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప" మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు యాస భాషలో మాట్లాడే యువకుడిగా ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు.

బన్నీ 'ఐకాన్' పై రూమర్లకు చెక్..!
మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టారు బన్నీ 21 చిత్రయూనిట్. ఇన్నిరోజులు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క పోస్టర్ తో గాసిప్ రాయుళ్ల నోర్లు మూయించారు. బర్త్‌డే విషెష్ చెబుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్ పాతదే... మళ్ళీ పోస్ట్ చేసి ఈ సినిమా పక్కన పెట్టలేదన్న క్లారిటీ ఇచ్చారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ కి జంటగా నటించేది ఎవరు అలాగే మిగితా నటీనటులు వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
మనవడి కోసం డైరెక్టర్ గా మారిన సూపర్ స్టార్..!
పైన టైటిల్ చూసిన వెంటనే మనవడి కోసం అంటే టక్కున మహేష్ తనయుడు గౌతమ్ అనుకొని వుంటారు కదా. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఇంకే మనవడికి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ గా మారారబ్బా అన్న డౌట్ రావొచ్చు. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్ళాల్సిందే.

2021 వేసవికి ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్?
వేసవి సినిమాలంటేనే వినోదాలకు చిరునామా. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా 2020 సమ్మర్ కాస్త `జీరో రిలీజెస్`తో బోసిపోయింది. ఈ నేపథ్యంలో.. ఆ లోటుని తీర్చే దిశగా 2021 వేసవి ముస్తాబవుతోందని సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

లాక్ డౌన్ నేపథ్యంతో ‘ఎఫ్ 3’?
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా 'పటాస్' నుండి రీసెంట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' వరకు తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా, కెరీర్‌లోనే తొలిసారి తన దర్శకత్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.
యన్టీఆర్‌కి ఆ సెంటిమెంట్ మరోసారి కలిసొస్తుందా?
యంగ్ టైగర్ యన్టీఆర్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో తారక్‌కు పెదనాన్నగా మోహన్ లాల్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. అంతేకాదు.. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా కంటతడి పెట్టించాయి. కట్ చేస్తే.. మరోసారి ఇలానే కుటుంబ బంధం ఉన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారట తారక్, లాల్.

నితిన్ కి విలన్‌గా రమ్యకృష్ణ ?
ఎలాంటి హావభావాన్నైనా అలవోకగా పలికించగలిగే అతి కొద్దిమంది నటీమణుల్లో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ అయ్యాక కూడా తన సత్తా చాటుతున్న ఈ మాజీ కథానాయిక.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ముఖ్య భూమికలు పోషిస్తోంది. మరీ ముఖ్యంగా `బాహుబలి` సిరీస్ తరువాత రమ్యకృష్ణ ధరించే పాత్రలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఛాలెంజింగ్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రమ్య.
అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ కు తన బర్త్ డే కానుకగా తాను నటించే మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. "పుష్ప" మూవీ లో అల్లు అర్జున్ మాస్ లుక్ అభిమానులతో పాటుప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

#AA 20 మూవీ ఫస్ట్ లుక్ &టైటిల్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంచలన చిత్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో #AA 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అందాల రష్మిక కథానాయిక. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.