కృష్ణ ‘మామా అల్లుళ్ళ స‌వాల్‌’కు 40 ఏళ్ళు

Super Krishna's Blockbuster Movie Mama Allulla Saval Completes 40 Years

తెలుగునాట కొన్ని కాంబినేష‌న్స్ సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాదు.. చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. అటువంటి గ్రేట్ కాంబినేష‌న్స్‌లో ఒక‌టి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, కె.య‌స్.ఆర్.దాస్‌ది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన వీరిద్ద‌రి సినీ ప్ర‌యాణంలో.. 30కి పైగానే సినిమాలు తెర‌కెక్కాయి. అంతేకాదు.. సింహ‌భాగం విజ‌యాల‌ను సాధించాయి కూడా. అలాంటి చిత్రాలలో ‘మామా అల్లుళ్ళ స‌వాల్’ ఒక‌టి. కృష్ణ‌, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, జ‌మున‌, చంద్ర‌మోహ‌న్, ప్ర‌భాక‌ర రెడ్డి, అల్లు రామ‌లింగ‌య్య‌, ర‌మాప్ర‌భ, నిర్మ‌ల‌, జ‌య‌మాలిని ముఖ్య భూమిక‌లు పోషించారు. ఈ సినిమాకి యం.డి.సుంద‌ర్ క‌థ‌ను అందించగా.. జంధ్యాల సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, వీటూరి గీత ర‌చ‌న‌ చేయ‌గా.. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. “ఒక నాటిది కాదు వ‌సంతం”, “చిటుక్కు చిటుకు”, “చ‌క్క‌న‌మ్మ వ‌చ్చింది”, “మంచిత‌నానికి మాయ‌ని మ‌మ‌త‌”, “చ‌క్క‌నైన మా కృష్ణ‌య్య‌ను”, “ఓ మండ‌పేట మైన‌ర్‌”, “శ్రీ‌దేవి వంటి మా చిట్టిత‌ల్లికి”.. వంటి పాట‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ చిత్రాన్ని కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్పించ‌గా.. శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆర్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై కుద‌ర‌వ‌ల్లి సీతారామ‌స్వామి నిర్మించారు. 1980 ఏప్రిల్ 10న విడుద‌లైన ‘మామా అల్లుళ్ళ స‌వాల్’.. నేటితో 40 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =