ఇకపై రీమిక్స్ లు జోలికి వెళ్లనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. పాపం అంతలా ఎం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోడానికి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే… మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్… మొదటి నుండి కాస్త తన మేన మామలు చిరంజీవిని, పవన్ ను అనుకరిస్తూనే ఉండేవాడు.. అంతే కాదు తన సినిమాల్లో మామ చిరు పాట ఒక్కటైనా రీమిక్స్ ఉండేలా చూసేవాడు. దీనితో సాయితేజ్ అలా చేయడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయితేజ్ దీనిపై స్పందించి…ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు చేయనని తేల్చిచెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందో లేదో చూద్దాం…




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: