పూర్వ స్థితికి చేరుకుంటాం – చిరంజీవి

We Will Bounce Back To Normal Position Says Megastar Chiranjeevi

కరోనా మహమ్మారి కారణంగా పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ బంద్ కావడం , థియేటర్స్ మూతపడటం, కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా సంక్షోభం లో చిక్కుకుంది. మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ గురించి, చిత్ర పరిశ్రమ నష్టాల గురించితన అప్ కమింగ్ మూవీ “ఆచార్య” గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా వైరస్ గురించి, చాల వేగంగా ఇతర దేశాలలో వ్యాపించడం గురించి చదివిన చిరంజీవి దర్శకుడు శివ తో చర్చించి “ఆచార్య” మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. ఆరోజే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్స్ మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రోజు వారీ జీతాలతో బ్రతికే పేద కళాకారులు, కార్మికుల సంక్షేమానికి కొంతమంది తో డిస్కస్ చేసిన చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను నెలకొల్పారు. సినీ ప్రముఖుల విరాళాలతో కార్మికులకు సహాయం అందిస్తున్నామని చిరంజీవి తెలిపారు.సినీ కార్మికులు 10000 నుండి 12000వరకు ఉన్నారని, రోజుకు 600మంది కి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారమని, కొన్ని లక్షల మంది చిత్ర పరిశ్రమ పై ఆధారపడి బ్రతుకుతున్నారని, నష్టాలను ఇప్పుడే అంచనా వెయ్యలేమని, వందల కోట్ల లలో నష్టం సంభవించే అవకాశం ఉందని, కరోనా వైరస్ నుండి నార్మల్ అయిన తరువాత చిత్ర పరిశ్రమ తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నానని తెలిపారు.

ట్విట్టర్ ఖాతా ప్రారంభించించి ఎంజాయ్ చేస్తున్నానని, కొన్ని వీడియోస్, మెసేజ్ లతో కరోనా పై అవగాహన కల్పిస్తున్నానని, కరోనా అవగాహన, జాగ్రత్తలపై రుపొందించిన వీడియో ను మోదీ ప్రశంసించారని, స్టార్ హీరోలతో రూపొందిన మరో వీడియో లో నటించానని, రాబోయే రోజులలో COVID-19 అవగాహనపై మరిన్ని వీడియోస్ రూపొందించే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. “ఆచార్య” మూవీ లో మహేష్ బాబు నటిస్తాడనే వార్త ఎలా వచ్చిందో తెలియదని, రామ్ చరణ్ నటిస్తున్నాడని, మహేష్ బాబు, తాను నటించే అవకాశం వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. “ఆచార్య” మూవీ నుండి కాల్ షీట్స్ ప్రాబ్లమ్ తో త్రిష వైదొలిగారని, కాజల్ అగర్వాల్ ఎంపిక అయ్యారని, అరవింద్ ఫ్యామిలీ తో కలసి మేమంతా ఒక కుటుంబం అని, నాగబాబు, కళ్యాణ్ తాను రెగ్యులర్ గా టచ్ లో ఉంటామని, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలతో రూపొందుతున్న ఆటోబయోగ్రఫీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నానని చిరంజీవి తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.