ఈసారి టైటిల్ తోనే మొదలుపెట్టాడుగా బన్నీ..!

Allu Arjun Sets A Record With His New Movie Title On Twitter
Allu Arjun Sets A Record With His New Movie Title On Twitter

సుకుమార్ సినిమాతో కూడా అల్లు అర్జున్ అప్పుడే సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటలు రూపంలో పలు రికార్డ్స్ క్రియేట్ చేసాడు బన్నీ. ఆ సినిమా హిట్ లో సగభాగం మ్యూజిక్ దే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక పుష్ప అనే టైటిల్…బన్నీ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. గుబురుగడ్డం, మెడకు నల్ల తాడు, డీ గ్లామర్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ను ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. దీనితో ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. మరి టైటిల్ తోనే మొదలుపెట్టిన బన్నీ సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

 

 

View this post on Instagram

 

#Pushpa 🔥

A post shared by Mythri Movie Makers (@mythriofficial) on

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fifteen =