వెంక‌టేష్ 50వ చిత్రం ‘వాసు’కి 18 ఏళ్ళు

Venkatesh's Musical Blockbuster Vasu Completes 18 Years

“పాడ‌నా తీయ‌గా క‌మ్మ‌ని ఒక పాట‌.. పాట‌గా బ్ర‌త‌క‌నా మీ అంద‌రి నోట‌”.. ఇలా కోరుకునే ఒక గాయ‌కుడి క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రమే ‘వాసు’. విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించారు. వెంకీకి జోడీగా భూమికా చావ్లా న‌టించగా.. విజ‌య‌కుమార్, మంజుల‌, సునీల్, అలీ, అచ్యుత్, వ‌ర్ష, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, రంగ‌నాథ్, బ్ర‌హ్మాజీ, రఘునాథ రెడ్డి ముఖ్య పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, పోతుల ర‌వికిర‌ణ్ సాహిత్యం స‌మ‌కూర్చ‌గా.. హారీస్ జ‌య‌రాజ్ చార్ట్ బ‌స్ట‌ర్ ట్యూన్స్ అందించారు. “పాట‌కు ప్రాణం”, “పాడ‌నా తీయ‌గా”, “ఓ ప్రేమ‌”, “వాలె వాలె”, “న‌మ్మ‌వే అమ్మాయి”, “స్పోర్టివ్ బాయ్స్”.. ఇలా ప్ర‌తీ పాట కుర్ర‌కారును ఉర్రూత‌లూగించింది. ఉత్త‌మ కుటుంబ చిత్రంగా “నంది” పుర‌స్కారాన్ని అందుకున్న ఈ సినిమా.. వెంక‌టేష్ కెరీర్‌లో 50వ చిత్రం కావ‌డం విశేషం. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.య‌స్.రామారావు నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల ఆదర‌ణ పొందింది. 2002 ఏప్రిల్ 10న విడుద‌లైన ‘వాసు’.. నేటితో 18 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =