మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం `సైరా నరసింహారెడ్డి`లో గిరిజన యువతిగా కనిపించింది మెగా డాటర్ నిహారిక. కట్ చేస్తే.. ఇప్పుడు చిరుతో మరోమారు స్క్రీన్ షేర్ చేసుకోనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ `ఆచార్య` పేరిట ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం మెగా డాటర్, నాగబాబు తనయ నిహారికను ఎంపిక చేసిందట చిత్ర బృందం. నిడివి తక్కువైనా నిహారిక పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే నిహారిక ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా, ‘ఆచార్య’లో చిరుకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను.. 2021 వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: