‘లూసిఫర్’ రీమేక్‌కి డైరెక్టర్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడా?

Saaho Director Sujeeth To Direct Lucifer Telugu Remake

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘రన్ రాజా రన్’(2014)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు సుజిత్. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆపై మలి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసాడు. ‘సాహో’(2019) పేరుతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ దర్శకుడిగా సుజిత్‌కు మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సుజిత్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ చేరుతోందని టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సుజిత్‌కు దక్కిందని సమాచారం. ఇదివరకు సుజిత్‌తో పాటు పలువురు అగ్ర దర్శకుల పేర్లు కూడా ‘లూసిఫర్’ రీమేక్ విషయంలో వినిపించాయి. అయితే.. చివరాఖరికి ఆ అవకాశం సుజిత్‌కే దక్కిందని తెలిసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, చిరు తాజా చిత్రం ‘ఆచార్య’ పూర్తయ్యాకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద‌ని అంటున్నారు.

మరి.. అనతికాలంలోనే చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను అందుకున్న సుజిత్ ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =