కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 131

Tollywood Actress Pranitha Starts The Initiative Help The Helping Hands To Help The Needy During The Lockdown
సినిమా వార్తలు

ప్రణీత "హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ "

కన్నడ హీరోయిన్ ప్రణీత "అత్తారింటికి దారేది", "పాండవులు పాండవులు తుమ్మెద", "రభస" వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్రణీత ప్రస్తుతం కన్నడ, హిందీ మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రణీత తన రీల్ విషయాలు, రియల్ విషయాలు పంచుకొన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ "అల - వైకుంఠపురములో .. మూవీ గురించి, అల్లు అర్జున్ , సామజవరగమన సాంగ్ గురించి ఆమె మాటలు వీడియోలో వీక్షించండి.

Team TFNవాట్సాప్
Director Hemant Madhukar Clears The Air Regarding Releasing Nishabdham Movie On OTT platforms
ఓటీటీ

OTT రిలీజ్ పై "నిశ్శబ్ధం" మూవీ దర్శకుడి స్పందన

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. US లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న "నిశ్శబ్ధం" మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ "భాగమతి " మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. "నిశ్శబ్ధం" మూవీ OTT లో రిలీజ్ కానుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి మే డే శుభాకాంక్షలు

ప్రతీ సంవత్సరం మే 1వ తేదీ కార్మిక దినోత్సవం గా కార్మికులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా కార్మికులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సకల దేవతలను ఒకటే ప్రార్థిస్తున్నా..!

కరోనా పై పోరాడేందుకు దేశం పెద్ద పోరాటమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే వున్నాయి. ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉంటూ సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక పలువురు ప్రముఖుల దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు ఎవరికీ వాళ్ళు ముందుకు వచ్చి విరాళాలు అందించారు.. అందిస్తూనే ఉన్నారు. పేద వారికి కావాల్సిన నిత్యావసర సరుకుల అందిస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ 'జగం' కోలుకున్నాక .. 'జగమే తంత్రం' థియేటర్స్ లోనే..!

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంత్రం' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని... ఈ కరోనా నుండి ఈ జగం కోలుకున్నాక థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరి లాక్ డౌన్ వల్ల రిలీజ్ లు ఆగిపోవడంతో పలు సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెన్న తీయడం ఎలా..నానమ్మతో చరణ్..!

లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలో ఇంట్లో కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా తాము చేసే పనులను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఓ వీడియో ను పోస్ట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
ఓటీటీ

'ఓటీటీ' పై కన్నేసిన సురేష్ బాబు..?

లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మొత్తం మూతపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలో కాస్త ప్రేక్షకులకు కాలక్షేపం అవుతుందంటే.. అది బుల్లి తెర... 'ఓటీటీ' ఫ్లాట్ ఫామ్స్ వల్లనే అని చెప్పొచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పుణ్య‌మా అని – ఈ లాక్ డౌన్ కాలంలో టైమ్ పాస్ అయిపోతోంది. ఇక ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ సంగతి పక్కన పెడితే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ మాత్రం పుంజుకున్నాయి. అంతే కాదు ఫ్యూచర్ లో కూడా ఈ ఫ్లాట్ ఫామ్స్ కే ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముందు ముందు చిన్న సినిమాలను ఈ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేసిన ఆశర్యపడనక్కర్లేదు. దీనితో మన టాలీవుడ్ నిర్మాతలకు పరిస్థితి ముందే అర్థమైనట్టు ఉంది. అందుకే ఒక్కొక్కరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కుటుంబక‌థా చిత్రం ‘లాహిరి లాహిరి లాహిరిలో’కి 18 ఏళ్ళు

“అసలేం జరుగుతోంది ఇక్కడ.. నాకు తెలియాలి తెలియాలి తెలియాలి..” అంటూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నందమూరి హరికృష్ణ పలికిన ఈ డైలాగ్ అప్పట్లో సంచలనం. ఇందులో పెద్దన్నయ్యగా హరికృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అలాగే, అన్న‌య్య మాట జ‌వ‌దాట‌ని తమ్ముళ్ళుగా సుమన్, వినీత్ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌కి భార్యలుగా భానుప్రియ, రచన, సంఘవి న‌టించారు. యలమంచిలి గీత సమర్పణలో 'బొమ్మరిల్లు వారి' పతాకంపై దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో.. ఆదిత్య ఓమ్, అంకిత నాయకానాయికలుగా పరిచయమయ్యారు. సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆన్ లైన్ కోర్స్ లో తేజ బిజీ

తెలుగు, హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ , సక్సెస్ ఫుల్ "చిత్రం " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "జయం", "నేనే రాజు నేనే మంత్రి " వంటి పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించిన తేజ "అలిమేలు మంగ" , "రాక్షస రాజు రావణాసురుడు " మూవీస్ ను అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
Super Star Krishna Historic Hit Alluri Seeta Rama Raju Completes 46 Years.
సినిమా వార్తలు

సూప‌ర్ స్టార్ కృష్ణ హిస్టారిక్‌ హిట్ ‘అల్లూరి సీతారామరాజు’కు 46 ఏళ్ళు

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహావీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి అమరజ్యోతులై, ధృవతారలుగా వెలిగారు. అటువంటి ధృవతారల్లో తెలుగు వీరుడు, మన్నెందొర అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆ మహనీయుని చరిత్రకు వెండితెర రూపమే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో అజిత్ కు బర్త్ డే శుభాకాంక్షలు

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా లో అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. "అమరావతి "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ "వాలి" , "పూవెల్లా ఉన్ వాసమ్" ," విలన్", "వరలారు" , "మన్ కథ" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. దర్శకుడు శివ, హీరో అజిత్ కాంబినేషన్ లో "వీరమ్", "వేదాళం", "వివేగం", "విశ్వాసం" , దర్శకుడు వినోత్ , అజిత్ కాంబినేషన్ లో "నెర్కొండ పార్వై" తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజకి పోలీస్ కథలు భలేగా అచ్చొచ్చాయి. ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’.. ఇలా పలు చిత్రాల్లో రవితేజ ఖాకి ధరించారు. వాటిలో సింహభాగం విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ నుంచి మరో పోలీస్ స్టోరీ రాబోతోంది. ఆ మూవీనే.. ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తన లక్కీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమిది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పరుగు’కు 12 ఏళ్ళు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘పరుగు’ ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇందులో బన్నీ సరసన షీలా కథానాయికగా నటించగా ప్రకాష్‌రాజ్, సునీల్, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, చిత్ర‌లేఖ‌, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ధన్‌రాజ్, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. ‘సహజనటి’ జయసుధ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపిస్తారు..!

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కాశీ ఎపిసోడ్ ఉంటుందని... అక్కడ బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చిన సంగతి విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జూనియర్ 'యష్' ను పరిచయం చేసిన యష్..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందిత..!

'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ప్రేమ కథా చిత్రమ్', 'అభినేత్రి' 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతుంది. ప్రస్తుతం నందిత 'ఐపీసీ 376' అనే సినిమాలో నటిస్తుంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ రోజు నందిత శ్వేత పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా యూనిట్ ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ చూస్తే మరి నందిత పోలీస్ ఆఫీసర్ గా బాగానే సెట్ అయినట్టు కనిపిస్తుంది. పోస్టర్ అయితే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నామీద నాకు లేనప్పుడే మీ మాటలు హెల్ప్ చేశాయి..!

నిన్ననే దేశం ఒక మంచి నటుడిని కోల్పోగా దాని నుండి ఇంకా కోలుకోకముందే.. మరో దిగ్గజ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. రిషి కపూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ముంబైలోని ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్... చికిత్స పొందుతూ మృతి చెందారు. రిషి కపూర్ మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్ బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Pushpa Movie Going To Be A Feast For Action Lovers.
సినిమా వార్తలు

"పుష్ప " మూవీ లో భారీ యాక్షన్ సీన్స్

బ్లాక్ బస్టర్ "రంగస్థలం" మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో "పుష్ప" మూవీ రూపొందుతుంది. రష్మిక కథానాయిక కాగా సునీల్ శెట్టి, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప " మూవీ తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్స్ వినడంలో రామ్ బిజీ

బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన రామ్ పోతినేని, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "రెడీ"," కందిరీగ", "పండగ చేస్కో", "నేను శైలజ" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టైలిష్, సింపుల్, స్మార్ట్ , పక్కింటి అబ్బాయి వంటి పాత్రలలో కనిపించిన రామ్ ఒక్కసారిగా రఫ్ లుక్ లో మారి "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ ఎఫెక్ట్ - ఆగిపోయిన 2000 కోట్ల టాలీవుడ్ బిజినెస్ ..!

కరోనా వల్ల ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్, మే నెలలో చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూత పడటంతో..సినిమా రిలీజ్ లు అన్ని ఆగిపోయాయి. అంతేనా ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడింది. ఎన్నో సినిమాలు దసరాకి.. దీపావళి కి షెడ్యూల్ ను పెట్టుకొని ఉన్నాయి. కానీ షూటింగ్ లు మధ్యలో ఆగిపోవడం వల్ల ఆ సినిమాలు కాస్త వచ్చే ఏడాదికి వెళ్లాయి. ఒక వేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ అయితే అప్పుడే తెరుచుకునే పరిస్థితులు అయితే లేవు. థియేటర్లు, మాల్స్ , పబ్లిక్ ఎక్కువగా వుండే ప్రదేశాలకు అనుమతి ఇస్తారని అనుకుకోవడం లేదు. ఎంతో కఠిన…

TFN Adminవాట్సాప్

షేర్