సకల దేవతలను ఒకటే ప్రార్థిస్తున్నా..!

Veteran Film Maker Raghavendra Rao Offers Prayers To God To Protect Everyone From Corona Virus
Veteran Film Maker Raghavendra Rao Offers Prayers To God To Protect Everyone From Corona Virus

కరోనా పై పోరాడేందుకు దేశం పెద్ద పోరాటమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే వున్నాయి. ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉంటూ సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక పలువురు ప్రముఖుల దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు ఎవరికీ వాళ్ళు ముందుకు వచ్చి విరాళాలు అందించారు.. అందిస్తూనే ఉన్నారు. పేద వారికి కావాల్సిన నిత్యావసర సరుకుల అందిస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఇవన్నీ ఒక ఎత్తైతే డాక్టర్స్, నర్సులు, పోలీస్ లు చేసేది మరో ఎత్తు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి అహర్నిశలు కష్టపడుతూ మన ప్రాణాలను కాపాడుతున్నారు. వారి సేవలను గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఈ నేపథ్యంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారి కోసం ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.


తన ఇంట్లోని దేవతా ప్రతిమలను ఓ చోటకు చేర్చిన ఆయన, వాటిని శుభ్రంచేసి, ప్రత్యేక పూజలు జరిపారు. “సకల దేవతలను ఒకటే ప్రార్థిస్తున్నాను. ప్రజలందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి త్వరగా రక్షించమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా రాత్రింబవళ్ళు కష్టపడుతున్న వైద్యులకి, వైద్య సిబ్బందికి, పోలీస్ శాఖకి వారి సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి థ్యాంక్స్ చెబుతున్నాను.. అందరం కలిసి పోరాడి కరోనాను జయిద్దాం అని ట్వీట్ లో తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =