కుటుంబక‌థా చిత్రం ‘లాహిరి లాహిరి లాహిరిలో’కి 18 ఏళ్ళు

YVS Chowdary Wholesome Family Entertainer Lahiri Lahiri Lahirilo Turns 18

“అసలేం జరుగుతోంది ఇక్కడ.. నాకు తెలియాలి తెలియాలి తెలియాలి..” అంటూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నందమూరి హరికృష్ణ పలికిన ఈ డైలాగ్ అప్పట్లో సంచలనం. ఇందులో పెద్దన్నయ్యగా హరికృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అలాగే, అన్న‌య్య మాట జ‌వ‌దాట‌ని తమ్ముళ్ళుగా సుమన్, వినీత్ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌కి భార్యలుగా భానుప్రియ, రచన, సంఘవి న‌టించారు. యలమంచిలి గీత సమర్పణలో ‘బొమ్మరిల్లు వారి’ పతాకంపై దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో.. ఆదిత్య ఓమ్, అంకిత నాయకానాయికలుగా పరిచయమయ్యారు. సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి, “కళాతపస్వి” కె.విశ్వనాథ్, సత్యప్రియ, రంగనాథ్, రమాప్రభ, కాంతారావు, “స్వరకర్త” చక్రవర్తి, జయప్రకాష్ రెడ్డి, అచ్యుత్, క‌ల్ప‌న‌, వేణుమాధవ్ ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి వీనులవిందైన బాణీలు అందించగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. “కళ్ళలోకి కళ్ళు పెట్టి”, “ఓహోహో చిలకమ్మా”, “మంత్రమేదో వేసింది”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నేస్తమా ఓ ప్రియ నేస్త‌మా”, “వీరవేంకట సత్యనారాయణ”, “కిలిమిరే”, “మనసే”(రెండు వెర్షన్స్).. ఇలా ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. 2002 మే 1న విడుదలై ఘనవిజయం సాధించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’.. నేటితో 18 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =