నిన్ననే దేశం ఒక మంచి నటుడిని కోల్పోగా దాని నుండి ఇంకా కోలుకోకముందే.. మరో దిగ్గజ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. రిషి కపూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ముంబైలోని ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్… చికిత్స పొందుతూ మృతి చెందారు. రిషి కపూర్ మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్ బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిషి కపూర్ మరణంపై ‘ఓరు అడార్ లవ్’ ఫేమ్ ప్రియా వారియర్ స్పందించి భావోద్వేగమైంది. గతంలో రిషి కపూర్ తన గురించి చేసిన ట్వీట్ ను రీ పోస్ట్ చేసి.. మీరు నా గురించి చెప్పిన మాటలను నాకు ఎంత స్ఫూర్తినిచ్చాయో మాటల్లో చెప్పలేను.. నామీద నాకు నమ్మకం లేనప్పుడే మీరు చెప్పిన మాటలు ఎంతో మోటివేట్ చేసాయి అని నేను మీ టైములో ఉండి ఉంటే నేను మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని కోరుకుంటూ.. మీ ఆత్మకు శాంతి కలవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని పేర్కొంది.
కాగా ‘ఒరు అడార్ లవ్’ సినిమా సమయంలో ప్రియా వారియర్ కన్నుగీటే వీడియో ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే రిషి కపూర్ కూడాప్రియా ప్రకాష్ వారియర్ పై ట్వీట్ చేశారు. ప్రియ హావభావాలు అద్భుతమని.. ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప స్టార్ డమ్ సంపాదిస్తుందని అన్నారు. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని.. ‘నువ్వు నా కాలంలో ఎందుకు రాలేదు’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు రిషి కపూర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: