ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 130

కన్నడ హీరో యశ్ కు జోడీగా తమన్నా ?

త్రిష ఆన్ లైన్ లెసన్స్
పవన్ 29 సినిమా డైరెక్టర్ కన్ఫామ్..?
"లవ్ స్టోరీ " మూవీ అప్ డేట్
సోషల్ డ్రామా గా "#SDT 14"
అజిత్ కు విలన్ గా.. కార్తికేయ హింట్ ఇచ్చాడా..!
మలయాళ మూవీ లో నటించాలని ఉంది - లావణ్య త్రిపాఠి

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

కుటుంబకథా చిత్రం ‘ఆహ్వానం’కు 23 ఏళ్ళు
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 'ప్రభాస్ 21'
అనుష్కను అలా తీసుకున్నాం..!
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
మీరే మా నిజమైన 'సూపర్ హీరోస్'..!
కరోనాతో పోరాడుతున్న మన కోసం... రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్నారు డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులు. ఇక ఇప్పటికే వారి చేసే సేవలకు గాను అందరు వారి కృతజ్ఞతలు తెలుపుతుండగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడాదీనిపై స్పందించారు. ఈ కష్ట కాలంలో వారిపై ప్రేమ, సానుభూతి చూపించడమే వారికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. ఈ పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. వారికి గౌరవం ఇవ్వండి. అవిరామంగా పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి’అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే…
చెర్రీ పై చిరు కామెడీ- మా అమ్మ దగ్గర నీ 'బటర్' ఉడకదురా..!
సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినప్పటినుండి మెగాస్టార్ చిరు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క కరోనాకు సంబంధించిన సలహాలు సూచనలు చెబుతూనే మరోపక్క పలు ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న తన మానవరాలితో ఆడుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన చిరు తాజాగా చెర్రీపై కామెడీ చేస్తూ ట్వీట్ చేసాడు. రామ్ చరణ్ తన తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవితో కలిసి నిన్న వెన్న తీయడం ఎలాగో నేర్చికుంటూ.. ఆ వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చెర్రీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మై డియర్…

మహేష్, ప్రభాస్ లకు మథర్ క్యారెక్టర్ అయినా చేస్తా..!
బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి హిట్ తో పాటు తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తోనే జానీ సినిమా చేయడం.. దాని తర్వాత పవన్ ప్రేమ, పెళ్లి చేసుకోవడం ఇలా ఫాస్ట్ గా జరిగిపోవడంతో రేణు దేశాయ్ కు పెద్దగా సినిమా చేసే అవకాశాలు రాలేదు. పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా డైరెక్టర్ గా మారి సినిమా చేసింది కానీ మళ్ళీ నటన వైపు వెళ్ళలేదు. ముఖానికి మేకప్ వేసుకోలేదు. అయితే ఇప్పుడు తనకు అవకాశం వస్తే కనుక నటిస్తానని తానే చెప్తుంది. అది కూడా తల్లి పాత్ర అయినా పర్వాలేదట.

కన్నడ హీరో యశ్ కు జోడీగా తమన్నా ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హారో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. "KGF చాప్టర్ 1" మూవీ సీక్వెల్ గా రూపొందుతున్న "KGF చాప్టర్ 2" మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుందని సమాచారం. హీరో యశ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

త్రిష ఆన్ లైన్ లెసన్స్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష, సీనియర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందిన "విన్నై తాండి వరువాయా", ఎన్నై అరిందాళ్ " తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అయిన త్రిష దర్శకుడు గౌతమ్ మీనన్ ఫిల్మింగ్ లెసన్స్ తో ఒక వీడియో ను చిత్రీకరించారు.
పవన్ 29 సినిమా డైరెక్టర్ కన్ఫామ్..?
రాజకీయాలతో బిజీ గా ఉన్న పవన్ అసలు సినిమాలు చేస్తాడా? లేదా? అని అనుకుంటుండగా... ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెడ్తూ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. పరిస్థితులు బావున్నట్టయితే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు.
"లవ్ స్టోరీ " మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్, పోసాని, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా పవన్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న "లవ్ స్టోరీ " మూవీ అప్ డేట్ ను నిర్మాతలలో ఒకరైన పి. రామ్ మోహన్ రావు తెలిపారు.
సోషల్ డ్రామా గా "#SDT 14"
సక్సెస్ ఫుల్ "చిత్ర లహరి", ప్రతి రోజూ పండగే" మూవీస్ తరువాత సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో సాయి తేజ్, "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నివేత పేతురాజ్ కథానాయిక.
అజిత్ కు విలన్ గా.. కార్తికేయ హింట్ ఇచ్చాడా..!
`ఆర్ ఎక్స్ 100` తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అవి ఆశించినంత విజయం అందించలేక పోయాయి. వీటిలో `గ్యాంగ్ లీడర్`లో పోషించిన విలన్ రోల్ కు మాత్రం మంచి పేరొచ్చింది. హీరోగానే కాదు విలన్ గా కూడా తాను నటించగలని చూపించాడు.
మలయాళ మూవీ లో నటించాలని ఉంది - లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి సూపర్ హిట్ "సోగ్గాడే చిన్ని నాయనా ", భలే భలే మొగాడివోయ్ ", అర్జున్ సురవరం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. లావణ్య ప్రస్తుతం సందీప్ కిషన్ "A1 ఎక్స్ ప్రెస్ ", కార్తికేయ "చావు కబురు చల్లగా ", ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని లావణ్య కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.

25 శాతం మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’
తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’కి రీమేక్‌గా తెలుగులో ‘నారప్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మరోసారి అల్లు అర్జున్‌తో జట్టుకడుతున్న పూజా హెగ్డే?
‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో జంటగా నటించి అలరించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో.. ఈ జోడీకి తెలుగునాట ఎనలేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్‌కి తగ్గట్టే త్వరలోనే బన్నీ, పూజ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందని సమాచారం. అయితే, బన్నీ సినిమాలో ఈసారి నాయికగా కాకుండా.. ఓ ప్రత్యేక గీతం కోసం పూజ సందడి చేయనుందని టాలీవుడ్ టాక్.
13 ఏళ్ళ కెరీర్‌ని పూర్తిచేసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న ఈతరం దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. అతని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాడు.

కుటుంబకథా చిత్రం ‘ఆహ్వానం’కు 23 ఏళ్ళు
“దేవతలారా రండి.. మీ దీవెనలందించండి.. నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి.. కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి.. కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి..” అంటూ పాట రూపంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పే అమ్మాయికి అలాంటి భర్త వచ్చాక.. అనూహ్య పరిణామాలు ఎదురైతే.. వాటిని ఆమె ఏ విధంగా ఎదుర్కొంది? అన్నదే ‘ఆహ్వానం’ సినిమా.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’కు 45 ఏళ్ళు
తెలుగు సినిమా గ్లామర్‌కు సరికొత్త గ్రామర్ నేర్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అన్ని జానర్లలోనూ విజయాలు అందుకున్న ఘనత ఈ దర్శకేంద్రుడిది. అలాంటి రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బాబు’.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 'ప్రభాస్ 21'
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
పీరియాడికల్ డ్రామాగా ఎన్టీఆర్ 31 మూవీ.. విలన్ గా రణవీర్ సింగ్..?
స్టార్ హీరో సినిమా అంటే రూమర్స్ రావడం కామన్ థింగ్. ఏం చేసిన వాటిని ఆపడం కష్టం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. గత రెండేళ్లుగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉంది. దాదాపు చివరి దశకు రాగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది.

మే డే.. క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందిపై బాలయ్య ఉదారత..!
రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భద్రతా భాద్యతలను కట్టుదిట్టం చేసాయి. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు.
అనుష్కను అలా తీసుకున్నాం..!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
డాక్టర్ ను అవ్వబోయి యాక్టర్ ను అయ్యాను ఈ డైలాగ్ ఇప్పటికి చాలా సార్లే వినుంటాం. మన టాలీవుడ్ లో చాలా మంది హీరో, హీరోయిన్ లు, డైరెక్టర్ లు, నిర్మాతలు ఇలా చాలా పెద్ద చదువులు చదివిన వాళ్లే వున్నారు. వాళ్ళల్లో కొంత మంది సినిమా మీద ప్రేమతో పెద్ద ఉద్యోగాలు సైతం వదులుకొని రాగా.. కొంతమంది మాత్రం అనుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా వున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా సినిమా మీద ప్రేమతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. చిన్న పాత్రలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి విజయ్ ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు.