జూనియర్ ‘యష్’ ను పరిచయం చేసిన యష్..!

KGF Actor Yash Shares Photo Of His New Born Through Instagram
KGF Actor Yash Shares Photo Of His New Born Through Instagram

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా యష్ భార్య గత సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యష్ తన బాబుకి 6 నెలలు రావడంతో బాబు ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అంతే కాదు బాబు కి హాయ్ చెప్పండి అంటూ.. మీ ప్రేమ ఆశీర్వాదం అందించమని కోరాడు. దీనితో ఫాన్స్ తెగ సంబరపడిపోతూ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fourteen =