“పుష్ప ” మూవీ లో భారీ యాక్షన్ సీన్స్

Allu Arjun Pushpa Movie Going To Be A Feast For Action Lovers.

బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో “పుష్ప” మూవీ రూపొందుతుంది. రష్మిక కథానాయిక కాగా సునీల్ శెట్టి, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “పుష్ప ” మూవీ తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. డ్యాన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారన్న విషయం తెలిసిందే. భారీ ఫైట్, యాక్షన్ సీన్స్ కై హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ తో చిత్రీకరణ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్ లేదా కనల్ కన్నణ్ తో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. షూటింగ్స్ ప్రారంభం అయినతరువాత గ్యాప్ లేకుండా “పుష్ప ” మూవీ చిత్రీకరణ జరపాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =