సూప‌ర్ స్టార్ కృష్ణ హిస్టారిక్‌ హిట్ ‘అల్లూరి సీతారామరాజు’కు 46 ఏళ్ళు

Super Star Krishna Historic Hit Alluri Seeta Rama Raju Completes 46 Years.

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహావీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి అమరజ్యోతులై, ధృవతారలుగా వెలిగారు. అటువంటి ధృవతారల్లో తెలుగు వీరుడు, మన్నెందొర అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆ మహనీయుని చరిత్రకు వెండితెర రూపమే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవవీరుడై బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెల్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమోహశక్తి, సంగ్రామభేరి, స్వాతంత్ర్యనినాదం..” అంటూ క్లైమాక్స్‌లో కృష్ణ పలికిన సంభాషణలు ఇప్పటికీ ప్రతీ తెలుగువాడి మదిలో మెదులుతూనే ఉంటాయి.

అగ్ర దర్శకులు వి.రామచంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయనిర్మల, జగ్గయ్య, గుమ్మడి, చంద్రమోహన్, మంజుల, బాలయ్య, ప్రభాకరరెడ్డి, రావు గోపాలరావు, కాంతారావు, రాజశ్రీ, త్యాగరాజు, చలం, పండరీభాయి ముఖ్య భూమికలు పోషించారు. కృష్ణ తనయుడు మాస్టర్ రమేష్ బాబు అతిథి పాత్రలో దర్శనమిచ్చాడు. కృష్ణ కెరీర్‌లో 100వ చిత్రంగానే కాకుండా.. దక్షిణ భారత సినీ చరిత్రలో మొట్ట మొదటి సినిమా స్కోప్‌గానూ ‘అల్లూరి సీతారామరాజు’ చరిత్ర‌లో చోటు సంపాదించుకుంది.

శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, డా.సి.నారాయణరెడ్డి, ఆదినారాయణరావ్ సాహిత్యం సమకూర్చగా ఆదినారాయణరావ్ అలరించే బాణీలు అందించారు. వాటిలో “తెలుగువీర లేవరా”, “వస్తాడు నా రాజు ఈరోజు”, “రగిలింది విప్లవాగ్ని ఈరోజు”, “విప్లవం మరణించదు”.. వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. “తెలుగు వీర లేవరా” పాటకు గాను ఉత్తమ గీత రచయితగా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్నారు శ్రీశ్రీ. అంతేకాదు.. ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో ‘నంది’ని కైవసం చేసుకుందీ సినిమా. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై జి.హనుమంతరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1974 మే 1న విడుదలైన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో హిస్టారిక్ హిట్‌గా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’.. నేటితో 46 వసంతాలను పూర్తిచేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =