పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందిత..!

Actress Nandita Swetha Plays Police Officer In IPC 376 Movie
Actress Nandita Swetha Plays Police Officer In IPC 376 Movie

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘అభినేత్రి’ 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతుంది. ప్రస్తుతం నందిత ‘ఐపీసీ 376’ అనే సినిమాలో నటిస్తుంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే ఈ రోజు నందిత శ్వేత పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా యూనిట్ ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ చూస్తే మరి నందిత పోలీస్ ఆఫీసర్ గా బాగానే సెట్ అయినట్టు కనిపిస్తుంది. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.. సినిమా ఎంత వరకూ ఉంటుందో చూడాలి. రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో నందిత శ్వేత కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =