ఈ ‘జగం’ కోలుకున్నాక .. ‘జగమే తంత్రం’ థియేటర్స్ లోనే..!

Dhanush New Movie Jagame Tanthram To Release In Theatres After Lockdown
Dhanush New Movie Jagame Tanthram To Release In Theatres After Lockdown

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ‘జగమే తంత్రం’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని… ఈ కరోనా నుండి ఈ జగం కోలుకున్నాక థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరి లాక్ డౌన్ వల్ల రిలీజ్ లు ఆగిపోవడంతో పలు సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చినట్టున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను ను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.

దీనితో పాటు మరో సినిమాను సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్నాడు ధనుష్. ఈ చిత్రానికి క‌ర్ణ‌న్ అనే పేరు పెట్టారు. క‌లైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ న‌టి ర‌జిష విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.