మాస్ మహారాజా రవితేజకి పోలీస్ కథలు భలేగా అచ్చొచ్చాయి. ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’.. ఇలా పలు చిత్రాల్లో రవితేజ ఖాకి ధరించారు. వాటిలో సింహభాగం విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ నుంచి మరో పోలీస్ స్టోరీ రాబోతోంది. ఆ మూవీనే.. ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తన లక్కీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి ఈ సినిమాని రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కిక్’ చిత్రం విడుదల తేదీ అయిన మే 8న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ‘క్రాక్’ వాయిదా పడకతప్పలేదు.
మరి.. లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా.. ఈసారి ఏ తేదీని టార్గెట్ చేసుకుంటాడో చూడాలి.
శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ‘క్రాక్’కి థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: