లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలో ఇంట్లో కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా తాము చేసే పనులను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఓ వీడియో ను పోస్ట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న రామ్ చరణ్.. తాజాగా నాన్నమ్మ అంజనా దేవి దగ్గర వెన్న తయారు చేసే విధానాన్ని తెలుసుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఈ వీడియోలో సురేఖకు, రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తున్నారు చిరంజీవి తల్లి అంజనా దేవి. ఇక రామ్ చరణ్‌ని ఆమె కృష్ణుడిలా ఉన్నావని అనగా.. నేను కృష్ణుడినా అంటూ నవ్వేసాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘‘సూపర్, నైస్ ఫ్యామిలీ’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా ప్రస్తుతం రామ్ చరణ్..ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Learning to make fresh butter before buttering them😜 🤗 #GrandmaRecipes #MomBoss
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































