స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పరుగు’కు 12 ఏళ్ళు

Stylish Star Allu Arjun Musical Blockbuster Parugu Completes 12 Years.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘పరుగు’ ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇందులో బన్నీ సరసన షీలా కథానాయికగా నటించగా ప్రకాష్‌రాజ్, సునీల్, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, చిత్ర‌లేఖ‌, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ధన్‌రాజ్, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. ‘సహజనటి’ జయసుధ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ ఛార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు. “నమ్మవేమోగాని”, “మనకన్నా పొడిచే”, “పరుగులు తీయకే”, “హృదయం..”, “ఛ‌ల్ ఛ‌ల్ ఛలో”, “ఎలగెల‌గ”.. ఇలా ఇందులోని అన్ని పాటలు విశేషాదరణ పొందాయి. ఉత్తమ తృతీయ చిత్రం, స్పెషల్ జ్యూరీ(అల్లు అర్జున్) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను అందుకున్న ఈ సినిమా.. బెస్ట్ యాక్టర్‌గా బ‌న్నీకి ఫిల్మ్‌ఫేర్ (సౌత్) అవార్డును కూడా అందించ‌డం విశేషం. ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోనూ (హిందీ – ‘హీరోపంతి’, బెంగాలీ – ‘షేయ్‌దిన్ దేఖా హోయ్‌చ్ఛిలో’, ఒడియా – ‘సంజు ఆయ్ సంజన’) రీమేక్ కావడం విశేషం. 2008 మే 1న విడుదలైన ‘పరుగు’.. నేటితో 12 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =