హీరో అజిత్ కు బర్త్ డే శుభాకాంక్షలు

Tamil Actor Thala Ajith Appeals His Fans Not To Celebrate His Birthday

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా లో అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. “అమరావతి “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ “వాలి” , “పూవెల్లా ఉన్ వాసమ్” ,” విలన్”, “వరలారు” , “మన్ కథ” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. దర్శకుడు శివ, హీరో అజిత్ కాంబినేషన్ లో “వీరమ్”, “వేదాళం”, “వివేగం”, “విశ్వాసం” , దర్శకుడు వినోత్ , అజిత్ కాంబినేషన్ లో “నెర్కొండ పార్వై” తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా అజిత్ బర్త్ డే వేడుకులకు దూరం గా ఉన్నారు. తన బర్త్ డే వేడుకలు జరపొద్దని అభిమానులను కోరారు. హీరో అజిత్ ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మాతగా హెచ్ . వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” మూవీ లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే మరో షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. బర్త్ డే సందర్భంగా “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ రిలీజ్ అవుతుందని ఆశించిన అభిమానులు నిరాశ చెందారు. కరోనా కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో “వాలిమై” మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించమని నిర్మాత బోనీ కపూర్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =